Tillu Square 5 days box office collections: 5వ రోజు బాక్సాఫీస్ దగ్గర ఇదేం కుమ్ముడు సామి.. `టిల్లు స్క్వేర్` దెబ్బకు అన్ని రికార్డులు ఫసక్..
Tillu Square 5 days box office Collections: టీజే టిల్లు మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన `టిల్లు స్క్వేర్` దూకుడు ఎక్కడా ఆగడం లేదు. మొదటి రోజు రికార్డు బ్రేక్ వసూళ్లతో మొదలైన ఈ సినిమా ప్రయాణం.. రోజుకో రికార్డులను మటు మాయం చేస్తోంది. తాజాగా 5వ రోజు కూడా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్లో వసూళ్లను కుమ్మేసింది.
Tillu Square 5 days box office Collections: ఒక్కో హీరోకు ఒక్కో సినిమా లైఫ్ ఇస్తూ ఉంటుంది. అలా సిద్దు జొన్నలగడ్డకు 'డీజే టిల్లు' మూవీ మంచి గుర్తింపుతో పాటు ఓవర్ నైట్ స్టార్‌ను చేసింది. ఈ సినిమా సక్సెస్‌తో ఈ మూవీకి సీక్వెల్‌గా 'టిల్లు స్క్వేర్' మూవీతో పలకరించాడు. ఈ సినిమా తొలి రోజు తొలి ఆట నుంచే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
ఓవరాల్‌గా టిల్లు బ్రాండ్‌తో 'టిల్లు స్క్వేర్' దిమ్మ దిరిగే ఓపెనింగ్స్ వచ్చాయి. మొత్తంగా మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం. అటు వర్కింగ్ డే అయిన 4వ రోజుతో పాటు 5వ రోజు కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టి స్ట్రాంగ్ హోల్డ్‌తో రన్ అవుతోంది. 'టిల్లు స్క్వేర్' సక్సెస్‌తో హీరోగా సిద్దు రేంజ్ పెరిగింది. రిలీజ్ రోజు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా ఓవరాల్‌గా ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తొలిరోజే దాదాపు రూ. 25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది 'టిల్లు స్క్వేర్' మూవీ రెండో రోజు అదే జోరును కొనిసాగించింది. అటు 10th, ఇంటర్ ఎగ్జామ్స్ కూడా పూర్తి కావడం టిల్లు స్క్వేర్‌కు కలిసొచ్చాయి. మొత్తంగా వెళుతూ, వెళుతూ మార్చి నెలకు గుడ్ ఎండ్ కార్డ్ వేసింది.
టిల్లు స్క్వేర్ విషయానికొస్తే.. మొదటి పార్ట్ చూసినవారు రెండో పార్ట్‌కు ఈజీగా కనెక్ట్ అవుతారు. ఇక డీజే టిల్లు మాదిరి మాత్రం ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయినా.. ఈ సీజన్‌లో ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండటం టిల్లు స్క్వేర్‌కు కలిసొచ్చే అంశాలు.
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు.. రూ. 9.25 కోట్ల షేర్
రెండో రోజు తెలంగాణ, ఏపీలో రూ. 7.36 కోట్ల షేర్ రాబట్టింది.
మూడో రోజు.. ఏపీ, తెలంగాణలో రూ. 7.44 కోట్ల షేర్..
నాల్గో రోజు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.91 కోట్ల షేర్
ఐదో రోజు.. ఏపీ, తెలంగాణలో కలిపి రూ. 2.80 కోట్ల షేర్ రాబట్టింది.
ఐదు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 30.76 కోట్ల షేర్ (రూ. 49 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది.
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల వసూళ్ల విషయానికొస్తే..
తొలి రోజు.. రూ. 14.30 కోట్ల షేర్ (రూ. 23.70 కోట్ల గ్రాస్)
రెండో రోజు.. రూ. 10.81 కోట్ల షేర్ (రూ. 18.90 కోట్ల గ్రాస్)
మూడో రోజు.. రూ. 12.01 కోట్ల షేర్ (రూ. 21.01 కోట్ల గ్రాస్)
4వ రోజు.. రూ. 5.46 కోట్ల షేర్ (రూ. 10.28 కోట్ల గ్రాస్)
5వ రోజు.. రూ. 3.70 కోట్ల షేర్ (రూ. 6.25 కోట్ల గ్రాస్)
వసూళ్లను రాబట్టింది. ఓవరాల్‌గా ఐదు రోజుల్లో 44.01 కోట్ల షేర్ (రూ. 76.25 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. కానీ సినిమా యూనిట్ రూ. 85 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ సినిమా ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..
తెలంగాణ (నైజాం).. రూ. 8 కోట్లు..
రాయలసీమ( సీడెడ్).. రూ. 3 కోట్లు..
ఆంధ్ర ప్రదేశ్.. రూ. 11 కోట్లు..
ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 22 కోట్లు
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్.. రూ. 2 కోట్లు
ఓవర్సీస్ .. రూ. 3 కోట్లు..
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగింది. ఓవరాల్‌గా ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని రూ.16 కోట్ల లాభంతో టాలీవుడ్‌లో మరో ఎపిక్‌గా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు హనుమాన్ తర్వాత ఆ రేంజ్ హిట్ ఈ సినిమాకే దక్కింది.ఈ సినిమా జోరు చూస్తుంటే.. ఈ సినిమా ముందు ముందు బాక్సాఫీస్ దగ్గర ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ రేటుకు సోల్డ్ అయిపోయాయి. ఈ సినిమా ఓటీటీ డిజిటల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ. 15 కోట్లకు తీసుకున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ మాత్రం దాదాపు రూ. 5 కోట్లకు అమ్ముడుపోయినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: CSK Fan Died: ఐపీఎల్‌లో విషాదం.. రోహిత్ శర్మ ఔట్‌పై వివాదం.. సీఎస్కే అభిమాని మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook