Tillu Square: సిద్దు జొన్నలగడ్డ సెన్సేషనల్ హిట్ మూవీ ‘డీజే టిల్లు’ కు సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం’ టిల్లు స్క్వేర్’. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదాలు పడుతూ ఎట్టకేలకు మార్చ్ 29న థియేటర్లలోకి వచ్చింది. మొదటి ఆటతోటే ఈ మూవీకి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. డీజే టిల్లు చిత్రంలో మెయిన్ లీడ్ రాధికా పాత్రలో నేహా శెట్టి నటించిన విషయం తెలిసిందే. ఇక టిల్లు స్క్వేర్ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చేసింది. ఈ మూవీ విడుదలకు ముందు సీక్వెల్ గా వచ్చే చిత్రంలో కూడా రాధికా పాత్ర ఉంటుంది అన్న టాక్ నడిచింది. ఇది ఒక రాధిక సినిమాటిక్ యూనివర్స్ లాగా ముందుకు సాగుతుంది అని కూడా కొందరు భావించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అప్పట్లో ఈ విషయాన్ని ఎవరో పెద్దగా పట్టించుకోకపోయినా సినిమా విడుదలయ్యాక అదే నిజమైనట్లు కనిపిస్తోంది. మొదటి పార్ట్ లో హీరోయిన్ నేహా శెట్టి టిల్లు స్క్వేర్ సినిమా సెకండ్ హాఫ్ లో రాధిక పాత్రను కంటిన్యూ చేస్తూ కనిపిస్తుంది. ఆమె గెస్ట్ అప్పీరెన్స్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఇక థియేటర్లో ఉన్న కుర్రాళ్ళు అయితే అరుపులు, విజిల్స్ తో తెగ హడావిడి చేశారు. 


డీజే టిల్లు చిత్రంతో రాధిక యూత్ లో సూపర్ ఫాలోయింగ్ సంపాదించింది. తిరిగి ఇలా ఆమెను స్క్రీన్ పైన చూసి థియేటర్లో అభిమానులు ఖుష్ అయిపోయారు. కాగా ఈ మూవీలో ప్రియాంక జవాల్కర్ కూడా గెస్ట్అపీరియన్స్ లో కనిపించింది.ట్యాక్సీవాలా, SR కల్యాణమండపం సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ ఉన్న ప్రియాంక కు ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. ఇప్పుడు ఈ మూవీ తర్వాత నెక్స్ట్ రాబోయే టిల్లు సీక్వెల్లో ప్రియాంక హీరోయిన్ గా నటిస్తుంది అన్న టాక్ వినిపిస్తోంది.


అంతేకాదు నెక్స్ట్ రాబోయే టిల్లు సీక్వెల్ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ గెస్ట్అపీరియన్స్ ఇస్తుందని.. ఇలా ఈ సీక్వెల్స్ కంటిన్యూ అవుతూ వెళ్తాయి అని.. నిజంగానే ఇది రాధిక సినిమాటిక్ యూనివర్స్ అని అంటున్నారు సినిమా చూసినవారు. దీనికి తగినట్టుగా ఇంతకుముందే సిద్దు టిల్లు సినిమాలు ఓ నాలుగైదు కంటిన్యూ అవ్వొచ్చు అని చెప్పాడు. దీంతో కచ్చితంగా ఈ మూవీకి సీక్వెల్ కూడా కంటిన్యూ అవుతుంది అని అభిమానులు భావిస్తున్నారు. అంతేకాకుండా డీజే టిల్లు తో పోలిస్తే టిల్లు స్క్వేర్ చాలా రొమాంటిక్ గా ఉండటంతో.. రాబోయే నెక్స్ట్ సినిమాలు ఇంకెంత రొమాంటిక్ గా ఉంటాయో అని అభిమానులు ఇప్పటినుంచే ఎదురుచూస్తున్నారు.


Also Read: Nita Ambani Visited Balkampet Temple: బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో నీతా అంబానీ ప్రత్యేక పూజలు..


Also Read: అంగరంగ వైభవంగా బర్రెలక్క రెండో వివాహం.. తరలివచ్చిన సోషల్‌ మీడియా అతిథులు



 


 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook