Tillu Square 2 days box office Collections: సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా నటించిన తాజాగా చిత్రం   'టిల్లు స్క్వేర్'. దాదాపు పదేళ్ల క్రితమే పరిచయమైన సిద్దుకు డీజే టిల్లు మూవీ వరకు  పెద్దగా బ్రేక్ రాలేదు. అప్పట్లో గుంటూరు టాకీస్‌ మూవీలో నటుడిగా ఓ  మోస్తరుగా ఆకట్టుకున్నాడు. ఇక 2022లో విడుదలైన టీజే టిల్లు మూవీతో సిద్దు జొన్నలగడ్డ సుడి తిరిగింది.
ఈ సినిమా సక్సెస్‌తో హీరోగా సిద్దు రేంజ్‌ పెరిగింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' మూవీతో మరోసారి ప్రేక్షకులను మాయ చేయడంలో సక్సెస్ అయ్యాడు. విడుదలైన రోజు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా ఈ సినిమా ముందు ముందు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి. ఓవరాల్‌గా అన్ని చోట్ల టిల్లు బ్రాండ్‌తో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. తొలిరోజే దాదాపు రూ. 25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన 'టిల్లు స్క్వేర్' రెండో రోజు అదే జోరును కొనిసాగించింఇ.
అటు 10th, ఇంటర్ ఎగ్జామ్స్ కూడా పూర్తి కావడం ఈ సినిమాకు  కలిసొచ్చిన అంశాలని చెప్పాలి. మొత్తంగా మార్చి నెలకు గుడ్ ఎండ్ కార్డ్ వేసిందనే చెప్పాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టిల్లు స్క్వేర్ విషయానికొస్తే.. మొదటి పార్ట్ చూసినవారు రెండో పార్ట్‌కు ఈజీగా కనెక్ట్ అవుతారు. ఇక డీజే టిల్లు మాదిరి మాత్రం ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయినా.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కుపిస్తూనే ఉంది.  మొత్తంగా ఈ సినిమా మరి చెత్తగా లేదు... మరి కొత్తగా లేదనే వాదనలు ప్రేక్షకుల నుంచి వస్తున్నాయి.  
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు.. రూ. 9.25 కోట్ల షేర్
రెండో రోజు తెలంగాణ, ఏపీలో రూ. 7.36 కోట్ల షేర్ రాబట్టింది.


ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా2 రోజుల వసూళ్ల విషయానికొస్తే..
తొలి రోజు..  రూ. 14.30 కోట్ల షేర్ (రూ. 23.70 కోట్ల గ్రాస్)
రెండో రోజు.. రూ. 10.81 కోట్ల షేర్ (రూ. 18.90 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టాయి. ఓవరాల్‌గా రెండు రోజుల్లో 25.11 కోట్ల షేర్ (రూ. 42.60 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


ఈ సినిమా ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..


తెలంగాణ  (నైజాం).. రూ. 8 కోట్లు..
రాయలసీమ( సీడెడ్).. రూ. 3 కోట్లు..
ఆంధ్ర ప్రదేశ్.. రూ. 11 కోట్లు..
ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 22 కోట్లు


కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్.. రూ. 2 కోట్లు
ఓవర్సీస్ .. రూ. 3 కోట్లు..
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 2.89 కోట్లు రాబడితే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమా జోరు చూస్తుంటే.. ఈ
సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎన్ని కోట్ల లాభాలను తీసుకుస్తుందో చూడాలి.
ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఈ సినిమా ఓటీటీ డిజిటల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ. 15 కోట్లకు  సొంతం చేసుకున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ మాత్రం దాదాపు రూ. 5 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం.


ఇదీ చదవండి:  ఆరోగ్యాన్నిచ్చే అక్రోట్లు.. డైలీ ఇలా తింటే మీ శరీరంలో బిగ్ మిరాకిల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook