Walnuts On Empty Stomach: ఆరోగ్యాన్నిచ్చే అక్రోట్లు.. డైలీ ఇలా తింటే మీ శరీరంలో బిగ్ మిరాకిల్..

Walnuts On Empty Stomach: మనందరికీ ఉదయం కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే, ఇది ఖాళీ కడుపుతో తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో వీటితో కాకుండా గింజలతో ఉదయం మొదలు పెడితే ఆరోగ్యంగా ఉంటారు.

Written by - Renuka Godugu | Last Updated : Mar 30, 2024, 01:09 PM IST
Walnuts On Empty Stomach: ఆరోగ్యాన్నిచ్చే అక్రోట్లు.. డైలీ ఇలా తింటే మీ శరీరంలో బిగ్ మిరాకిల్..

Walnuts On Empty Stomach: మనందరికీ ఉదయం కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే, ఇది ఖాళీ కడుపుతో తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో వీటితో కాకుండా గింజలతో ఉదయం మొదలు పెడితే ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా వీటిని రాత్రి పడుకునే ముందు నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్య లాభాలు పొందుతారు. అవేంటో తెలుసుకుందాం.

ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన వాల్‌నట్స్‌ తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటిని డ్రైగా కంటే నానబెట్టడం వల్ల వీటిలోని పోషకాలు డబుల్ అవుతాయి. రోజూ ఉదయం వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యం బాగుంటుంది. ఇందులోని ఫైబర్ మలబద్ధకం సమస్యకు చెక్ పెడుతుంది. ఫైబర్ ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల త్వరగా ఆకలి వేయదు. దీంతో బరువు పెరుగుతామనే భయం ఉండదు. ఎందుకంటే ఫైబర్ తీసుకోవడం వల్ల కడుపు ఎక్కువ సమయం నిండిన అనుభూతి కలుగుతుంది. రోజూ వాల్‌నట్స్ తింటే పెద్దలతోపాటు పిల్లల జ్ఞాపకశక్తి చురుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా ఇలా నానబెట్టిన వాలనట్స్ తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఆరోజంతా యాక్టివ్ గా కూడా ఉంటారు. 

ఇదీ చదవండి: రాగిరొట్టె డయాబెటిక్ రోగులకు దివ్యౌషధం.. రక్తంలో చక్కెర స్థాయిలను పెరగనివ్వదు...

నానబెట్టిన వాల్‌నట్స్‌లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వాల్‌నట్స్ అందరూ ఏంచక్కా తినేయొచ్చు. ముఖ్యంగా ఇది గుండె సంబంధిత సమస్యలను దరిచేరనివ్వదు. కొంతమందిలో హార్ట్‌ బ్లాక్స్ ఉంటాయి. వాల్‌నట్స్ హార్ట్‌ బ్లాకులు ఏర్పడకుండా రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. 

వాల్‌నట్స్ మాత్రమే కాదు ఉదయం పరగడుపున నానబెట్టిన గింజలు తీసుకుంటే ఎంతో ఆరోగ్యకరం. ముఖ్యంగా ఇవి జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి.  ఈరోజుల్లో చాలామందిని వేధిస్తోన్న సమస్య నిద్రలేమి. ఇలా వాల్‌నట్స్‌ మీ డైట్లో చేర్చుకుంటే ఒత్తిడి, ఆందోళనల నుంచి త్వరగా బయటపడతారు. వీళ్లు ప్రతిరోజూ ఉదయం రాత్రి నానబెట్టిన వాల్‌నట్స్ తీసుకోవాలి. వాల్‌నట్స్‌ లో మాత్రమే కాదు అవి నానబెట్టిన నీటిలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ఇదీ చదవండి:  పచ్చిఅరటికాయ 5 ప్రయోజనాలు తెలిస్తే.. రోజూ తింటూనే ఉంటారు..

వాల్‌నట్స్‌లో ఎక్కువ శాతం ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, ప్రొటీన్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులోని ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ శాతంలో ఉంటుంది. అంతేకాదు వాల్‌నట్స్‌లో కాపర్, ఫాస్పరస్ కూడా ఉంటాయి. ఇది ఓ విధంగా పోషకాల గని అని చెప్పుకోవాలి. డయాబెటిస్‌తో బాధపడేవారు వాల్‌నట్స్‌ తింటే వారికి ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News