Tillu Square World Wide Closing Collections: తెలుగులో ఒకప్పడు సీక్వెల్స్ తీస్తే ప్రేక్షకులు ఆదరంచలేదు. దీంతో సీక్వెల్స్ తెరకెక్కిస్తే ఫ్లాప్ అనే ముద్ర పడిపోయింది. కానీ రాను రాను కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదిరస్తారడానికి టిల్లు స్వ్కేర్ సహా పలు సీక్వెల్స్ చిత్రాలు ప్రూవ్ చేసాయి. ఈ కోవలో 'డీజే టిల్లు' మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' మూవీ ప్రేక్షకాదరణ పొందటం పాటు నిర్మాతలకు కాసులు వర్షం కురిపించింది. టిల్లు బ్రాండ్‌తో సిద్దు చేసిన యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. డీజే టిల్లు తరహాలోనే 'టిల్లు స్క్వేర్' కూడా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కడంతో ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కావడంతో వసూళ్ల వర్షం కురిపించారు. సిద్దు రేంజ్‌కు మించి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రూ. 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన 'టిల్లు స్క్వేర్' మూవీ.. రూ. 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగింది. అంతేకాదు  ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 49.20 కోట్ల షేర్ (రూ. 89.60 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 69 కోట్ల షేర్ (రూ. 130 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. మొత్తంగా బిజినెస్ పై రూ. 41 కోట్ల థియేట్రికల్‌గా లాభాలను తీసుకొచ్చింది. ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ పరంగా మరో రూ. 20 కోట్ల వరకు లాభాలను తీసుకొచ్చినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


ప్రస్తుతం 'టిల్లు స్క్కేర్' మూవీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. టిల్లు స్క్వేర్ మూవీతో స్మాల్ రేంజ్ హీరోల్లో ఎవరు అందుకొని బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. మొత్తంగా ఒక్క మూవీతో సిద్దుగాడి కిస్మత్ ఛేంజ్ అయింది.


సిద్దు జొన్నలగడ్డ.. దశాబ్దం క్రితం నాగ చైతన్య హీరోగా పరిచయమైన 'జోష్' మూవీతో నటడుఇగా ఎంట్రీ ఇచ్చాడు. అందులో గుర్తింపు లేని పాత్ర చేసాడు. ఆ తర్వాత మెల్ల మెల్లగా చిన్న సినిమాలతో ఇపుడు స్టార్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సిద్దు ప్రస్తుతం కథల విషయంలో దృష్టి పెడుతున్నాడు. ప్రస్తుతం టిల్లు క్యూబ్ మూవీ చేస్తున్నట్టు ప్రకటించారు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.  


Read more: Kedarnath Dham: కేదార్ నాథ్ యాత్రలో షాకింగ్ ఘటన... గాలిలో చక్కర్లు కొట్టిన హెలికాప్టర్.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter