Kedarnath Dham: కేదార్ నాథ్ యాత్రలో షాకింగ్ ఘటన... గాలిలో చక్కర్లు కొట్టిన హెలికాప్టర్.. వీడియో వైరల్..

Kedarnath yadra: కేదార్ నాథ్‌ యాత్రలో శుక్రవారం ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆరుగురు భక్తులతో ఉన్న హెలికాప్టర్ గాల్లో పలుమార్లు చక్కర్లు కొట్టింది. దీంతో భక్తులంతా భయంతో అరుపులు, కేకలు పెట్టారు. ఈ వీడియో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : May 24, 2024, 12:40 PM IST
  • కేదార్ నాథ్ యాత్రలో ఊహించని ఘటన..
  • ఆందోళన చెందిన భక్తులు..
Kedarnath Dham: కేదార్ నాథ్  యాత్రలో షాకింగ్ ఘటన... గాలిలో చక్కర్లు కొట్టిన హెలికాప్టర్.. వీడియో వైరల్..

Kedarnath yatra helicopter emergency landing video viral: హిందువులు తమ జీవితంలో చార్ ధామ్ యాత్ర ను ఎంతో పవిత్రంగా భావిస్తారు. తమ జీవితంలో ఒక్కసారైన  చార్ ధామ్ యాత్ర చేసి శివయ్యను దర్శనం చేసుకొవాలని పరితపిస్తుంటారు. కానీ చార్ ధామ్ యాత్ర అనేది ఎన్నో సవాళ్లతో కూడుకుని ఉంటుంది. అక్కడ పూర్తిగా భిన్నమైన వాతావరణం ఉంటుంది. మంచు కొండల మధ్య, వేల కిలో మీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. చార్ ధామ్ యాత్రకు వెళ్లే వారు.. ప్రత్యేకంగా ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ఇబ్బందులు తలెత్తుతుంటాయి. అక్కడ ఎత్తైన కొండలు, లోయలు పూర్తిగా మంచుతో కప్పబడి చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.  ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, పిల్లలకు ఇక్కడ వాతావరణంతో ఇబ్బందులు ఉంటాయని చెబుతుంటారు.

 

 అందుకే చార్ ధామ్ యాత్ర ను కొందరు భక్తులు, భూమిమీద కైలాసంగా భావిస్తారు. ఎన్నో రిస్క్ లున ఎదుర్కొని ఈ యాత్రకు వెళ్తుంటారు. ఇక ఇటీవల మే 12 న చార్ ధామ్ యాత్రను ప్రారంభించారు. చార్ ధామ్ యాత్ర ఎంతో ఆధ్యాత్మిక భావంతో కూడుకున్న ప్రయాణం అని భక్తులు చెబుతుంటారు.  ఈ ప్రయాణం ప్రతి ఏడాది..  ఏప్రిల్-మే నుండి అక్టోబర్-నవంబర్ వరకు జరుగుతుంది. చార్ ధామ్ యాత్రను సవ్యదిశలో చేయాలని అక్కడి వారు చెబుతుంటారు. అందుకే.. చార్ ధామ్ యాత్ర.. యమునోత్రి నుంచి మొదలై, గంగోత్రి వైపు, కేదార్‌నాథ్ మీదుగా సాగి, చివరకు బద్రీనాథ్ వద్ద ముగుస్తుంది.

ఇదిలా ఉండగా.. చార్ ధామ్ యాత్రలో శుక్రవారం మే 24 న అనుకొని ఘటన చోటు చేసుకుంది. కేదార్ నాథ్ ప్రాంతంలోని సిర్సీలో భక్తులకు ఊహించని ఘటన ఎదురైంది. సిర్సీ హెలిప్యాడ్ నుండి కేదార్‌నాథ్ ధామ్‌కు ఒక పైలట్‌తో పాటు 6 మంది ప్రయాణికులను కెస్ట్రెల్ ఏవియేషన్ కో హెలికాప్టర్ లో తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. హెలికాప్టర్ గాల్లోకి లేచిన కొద్ది నిముషాలకే  హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలెట్ గుర్తించాడు. అంతేకాకుండా.. కేదార్ నాథ్ కు మరో వంద మీటర్ల దూరం ఉందనగా.. హెలికాప్టర్ ను అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అప్పటికి దానిలో ఉన్న ఆరుగురు భక్తులు భయంతో గట్టిగా కేకలు వేసినట్లు తెలుస్తోంది. హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యల వల్లనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని, కేదార్ నాథ్ విపత్తు నిర్వాహణ అధికారి రుద్రప్రయాగ తెలిపారు.

Read more: Snakes facts: ప్రపంచంలోనే అత్యంత స్పీడ్ గా వెళ్లే పాములు.. ఇవి చాలా డెంజర్ భయ్యా.. డిటెయిల్స్ ఇవే..

 అయితే.. ఈ ఘటనలో హెలికాప్టర్ సెఫ్టీగా గానే ల్యాండ్ అయ్యింది. దీంతో హెలికాప్టర్ లో ఉన్న భక్తులంతా హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. రద్దీ కారణంగా, ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్ధామ్ యాత్రకు వచ్చే యాత్రికులందరికీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. హరిద్వార్ , రిషికేశ్‌లలో ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ నిలిపివేయబడినందున, ఇప్పుడు భక్తులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తర్వాత మాత్రమే చార్ధామ్ యాత్రకు రావచ్చని ఉత్తరాఖండ్ సర్కారు స్పష్టం చేసింది.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News