Bahubali2 Record Break: హిందీ సహా అన్ని బాషలలో బాహుబలి 2 రికార్డులు బద్దలు కొట్టడానికి ఎన్ని రోజులు పట్టిందంటే?
Bahubali 2 Record Break in All Markets: రాజమౌళి బాహుబలి 2 సినిమాతో సుదీర్ఘకాలం బద్దలు కానీ రికార్డులను సెట్ చేశారు. ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టడానికి ఆయా భాషల్లో ఎన్ని రోజులు పట్టింది అనే విషయం మీద ఒక లుక్కేసే ప్రయత్నం చేద్దాం.
Time taken to break Bahubali2 in All Markets: 2017లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2 సినిమా ఇప్పటికీ ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ అనే చెప్పుకోవాలి. ఈ సినిమా అప్పట్లోనే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ప్రభాస్ హీరోగా అనుష్క హీరోయిన్ గా రానా విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ అనేక మంది అభిమానులు ఉన్నారు. ఒక జానపద కథను తీసుకుని దాన్ని ఒక సినిమాగా తెరకెక్కించిన రాజమౌళి ఆ సినిమాతో సుదీర్ఘకాలం బద్దలు కానీ రికార్డులను సెట్ చేశారు.
ఇక ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టడానికి ఆయా భాషల్లో ఎన్ని రోజులు పట్టింది అనే విషయం మీద ఒక లుక్కేసే ప్రయత్నం చేద్దాం. తెలుగు విషయానికొస్తే బాహుబలి 2 కలెక్షన్ రికార్డులు బద్దలు కొట్టింది ఆర్ఆర్ఆర్. అంటే మళ్ళీ రాజమౌళి తన సొంత ఆర్ఆర్ఆర్ సినిమాతో 1792 రోజుల తర్వాత ఈ రికార్డు బద్దలు కొట్టాడు. ఇక కన్నడ సినీ పరిశ్రమ విషయానికి వస్తే కేజీఎఫ్ 2 సినిమా అక్కడ అప్పటి వరకు ఉన్న బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టింది. అలా బద్దలు కొట్టేందుకు 1812 రోజులు పట్టింది.
ఇక తమిళంలో ఈ రికార్డు బద్దలు కొట్టేందుకు 1862 రోజులు పట్టింది. కమల్ హాసన్ హీరోగా వచ్చిన విక్రం సినిమాతో ఆ రికార్డు బద్దలైంది. ఇక హిందీలో ఈ రికార్డుని షారుక్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ సినిమా బద్దలు కొట్టింది. అలా బద్దలు కొట్టేందుకు దాదాపు 2100 రోజులు పట్టింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పటివరకు మలయాళ సినీ పరిశ్రమలో బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టేందుకు మరే సినిమా రాలేదు. వచ్చిన సినిమాలు ఆడి వెళ్లిపోతున్నాయి కానీ బాహుబలి 2 స్థాయి రికార్డును మాత్రం బద్దలు కొట్టలేదని చెప్పాలి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అదే రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా మలయాళం లో బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టలేకపోయింది.
Also Read: Supritha Photos: పొట్టి బట్టల్లో సురేఖా వాణి కూతురు రచ్చ.. హీరోయిన్లను మించిన హాట్ షో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి