BB3 Release Date: నందమూరి బాలకృష్ణ అభిమానులకు శుభవార్త. నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న సినిమా విడుదల తేదీ ఖరారైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna ) తో మాస్ సినిమాలు తీయడంతో బోయపాటి శ్రీను ( Boyapati Srinu ) తరువాతే ఎవరైనా. సింహ, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఆ కోవకు చెందినవే. లెజెండ్ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా బీబీ3 ( BB 3 ) . పేరు వెరైటీగా ఉంది కదా. బీబీ3 ఫస్ట్‌రోర్ ( BB3 First Roar ) పేరుతో ఇటీవలే విడుదలైన టీజర్‌కు విశేష స్పందన లభించింది. ఈ సినిమాను ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీంందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.



అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బీబీ3 సినిమా విడుదల తేదీ ( BB3 release date ) ఖరారైంది. మే 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు ప్రత్యేక పోస్టర్‌ని బీబీ3 మేకర్స్ విడుదల చేశారు. టీజర్ ( BB3 Teaser ) ‌లో మాస్‌లుక్‌లో అదరగొట్టిన బాలకృష్ణ ( Balakrishna ) ఇప్పుడు ఈ ప్రత్యేక పోస్టర్‌లో స్టైలిష్‌గా కన్పిస్తున్నారు. మే 28వ తేదీన విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జయంతి కావడం విశేషం. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైశ్వాల్ ( Pragya jaiswal ) నటిస్తుండగా..తమన్ సంగీతం అందిస్తున్నారు. 


Also read: Director Shankar: డైరెక్టర్ శంకర్‌పై Non-bailable Warrant జారీ చేసిన కోర్టు, ముదురుతున్న వివాదం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook