AP movie tickets issue, Tollywood actor Naga babu tweets RGV absolutely right on Cinema Tickets issue : ఏపీ ప్రభుత్వానికి.. టాలీవుడ్‌ ఇండస్ట్రీ మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. సినిమా టికెట్స్ రేట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, (Andhra Pradesh Government) టాలీవుడ్‌ ఇండస్ట్రీ పెద్దల మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. ఈ క్రమంలో అటు ఏపీ ప్రభుత్వం (AP Government) తరఫున మంత్రులు, ఇటు తెలుగు ఇండస్ట్రీ తరుఫున కొందరు నటులు, ప్రొడ్యూసర్లు, (Producers) దర్శకులు రోజూ ఒక అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్ప‌టికే ఈ అంశంపై ప‌లువురు హీరోలు, ప్రొడ్యూసర్లు కామెంట్స్ చేశారు. తాజాగా దర్శకుడు రాంగోపాల్ వ‌ర్మ (Ram Gopal Varma) ఏపీలో సినిమా టికెట్ల రేట్లపై స్పందించి విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో (Social media) ఆయన చేసిన పోస్ట్‌లతో మళ్లీ ఏపీ సినిమా టికెట్ల రేట్ల విషయం చర్చకు వచ్చింది. 


సినిమా టికెట్ రేట్స్‌పై (Movie Ticket Rates‌) ప్రజలకు ఒక అవగాహన ఉండాలని చెప్తున్నా అంటూ కొన్ని పోస్ట్‌లు చేశాడు వర్మ. సినిమా టికెట్స్ రేట్ల సమస్యపై ఇండ‌స్ట్రీ వారు త‌మ మ‌న‌సులోని మాటలను బయటపెట్టాలి.. ఇది విన్నపం కాదు డిమాండ్ అని పేర్కొన్నాడు వర్మ.. మీరు ఇప్పుడు మౌనంగా ఉంటే ఇంకెప్పుడు మీ నోరు తెరవలేరని చెప్పుకొచ్చారు వర్మ. 


ఇక ఏపీ సినిమాటోగ్రాఫీ మంత్రి పేర్ని నానిని ట్యాగ్‌ చేస్తూ కొన్ని ట్వీట్స్ చేశాడు వర్మ. ఏపీ గవర్నమెంట్ (AP Government) సినిమా టికెట్ రేట్స్ (Cinema Ticket Rates) సమస్యను ప‌రిష్క‌రించాలని సూచించాడు. 


గవర్నమెంట్ ప్రొడ్యూసర్ల నుంచి సినిమా టికెట్స్ కొని.. వాటిని పేదలకు తక్కువ రేటుకు ఇచ్చేలా ఒక ప్లాన్ రూపొందించాలంటూ వ‌ర్మ సూచించాడు. ఇలా వరుసగా ట్వీట్స్ (Tweets) చేశాడు వర్మ. అంతేకాదు ఏపీ ప్రభుత్వానికి పది ప్రశ్నలను సంధిస్తూ ఒక వీడియో పోస్ట్ చేశాడు ఆర్జీవీ.




వర్మ చేసిన వ్యాఖ్యలకు తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి మద్దతు లభిస్తోంది. వర్మను సపోర్ట్ చేస్తూ టాలీవుడ్‌ (Tollywood‌) నటులు, దర్శకులు ట్వీట్స్ చేస్తున్నారు. 


ఆర్జీవీకి ఇప్పుడు నాగబాబు (Nagababu) మద్దతుగా నిలిచారు. ఆర్జీవీ అడిగిన ప్రశ్నలన్నీ కూడా సత్యాలే అని పేర్కొన్నారు నాగబాబు. నేను అడగాల్సిన ప్రశ్నలన్నింటినీ మీరు అడిగారని ఆర్జీవీని మెచ్చుకున్నారు. ఆర్జీవీ సంధించిన పది ప్రశ్నల వీడియోను రీట్వీట్ చేస్తూ ఈ కామెంట్స్ చేశాడు నాగబాబు. ఇక ఆర్జీవి కూడా థ్యాంక్యూ నాగబాబు అంటూ రీట్వీట్ చేశారు.




 


Also Read : ఉపాధ్యాయుడు సహా 19మంది విద్యార్థులకు కరోనా


అలాగే మా బాస్ రామ్‌ గోపాల్ వర్మని ఇండస్ట్రీకి పెద్ద దిక్కు గా చూడాలని నా కోరిక.. సామీ మీరు రావాలి సామీ అంటూ డైరెక్టర్ అజయ్ భూపతి ఒక ట్వీట్ చేశారు. దీనికి ఆర్జీవీ రిప్లై ఇచ్చారు. "అజయ్....ఇండస్ట్రీ వాళ్లకి పెద్ద దిక్కు ఉండాలనుకోవడం మూర్ఖత్వం.. ఎందుకంటే, ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్కరికీ వేరే వేరే స్వార్థాలు ఉంటాయి.. దాని మూలాన వారికి మాత్రమే పనికొచ్చే మాటే ప్రతి ఒక్కరూ వింటారు కానీ.. ఎవరికో పెద్దదిక్కు అని టైటిల్ ఇచ్చినంత మాత్రాన వారి మాట ఎవ్వడూ వినరు" అంటూ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) రిప్లై ఇచ్చాడు.



Also Read : JP Nadda Rally: హైదరాబాద్ లో హైటెన్షన్.. శంషాబాద్ చేరుకున్న బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి