Rahul Ramakrishna Blessed with Baby Boy అర్జున్ రెడ్డి, ఆర్ఆర్ఆర్, జాతి రత్నాలు అనే సినిమాలతో రాహుల్ రామకృష్ణకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. కామెడీ, సీరియస్, విలన్ ఇలా అన్ని రకాల పాత్రలను పోషిస్తూ రాహుల్ తన డిమాండ్‌ను పెంచుకుంటూ పోతోన్నాడు. రాహుల్ రామకృష్ణ సినీ లైఫ్ బాగానే ఉంది. కానీ ఆయన పర్సనల్ లైఫ్, సోషల్ మీడియాలో వ్యవహారాలే కాస్త గందరగోళానికి దారి తీస్తుంటాయి. రాహుల్ ప్రేమ, డేటింగ్, పెళ్లి వ్యవహారాలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



హరితను పెళ్లి చేసుకోబోతోన్నాను, తనకు కాబోయే భార్య తనే అని లిప్ కిస్ పెట్టి మరీ ప్రకటించాడు రాహుల్ రామకృష్ణ. అయితే పెళ్లి జరిగిందా? లేదా? అన్న సీక్రెట్ మాత్రం ఇంకా తెలియడం లేదు. ఏది ఏమైనా కూడా రాహుల్ మాత్రం ఇప్పుడు తండ్రి అయ్యాడు. ఈ మేరకు ఓ పోస్ట్ వేశాడు. బాబు పుట్టాడంటూ.. సంక్రాంతికి విడుదలయ్యాడు అంటూ తన సినీ భాషలో వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.


గత ఏడాది నవంబర్‌లో తాను తండ్రిని కాబోతోన్నాను అంటూ రాహుల్ ట్వీట్ వేశాడు. ఇప్పుడు తండ్రిని అయ్యానంటూ తన కొడుకుని కూడా చూపించాడు రాహుల్ రామకృష్ణ. ఈ గుడ్ న్యూస్ తెలియడంతో నెటిజన్లు రాహుల్‌కు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. మొత్తానికి రాహుల్ మాత్రం ఇలా పర్సనల్ లైఫ్‌లో ఓ కొత్త దశలోకి ఎంట్రీ ఇచ్చాడు.


రాహుల్ ట్వీట్లు ఎంతగా కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయో అందరికీ తెలిసిందే. కొంచెం పరుష పదాలను వాడుతూ దారుణంగా ట్వీట్లు వేస్తుంటాడు. రాహుల్ ఎక్కువగా వివాదాల్లో చిక్కుకుంటూ అందరి నోళ్లలో నానుతుంటాడు. గత ఏడాది రాహుల్ రామకృష్ణ రవితేజ రామారావు ఆన్ డ్యూటీలో నెగెటివ్ రోల్ వేయగా.. ఓరి దేవుడా సినిమాలో వెంకటేష్ పక్కన కనిపించి నవ్వించాడు. ఇప్పుడు ఇంటింటి రామాయణం అంటూ ఆహాలో రాబోతోన్నాడు.


Also Read:  Upasana Motherhood : ఈ సంక్రాంతికి మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నా.. ఉపాసన పోస్ట్ వైరల్


Also Read: Nandamuri Balakrishna Controversy : ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే.. క్షమాపణలు కోరిన బాలయ్య



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook