Latest Update on Varun Sandesh Accident: హీరో వరుణ్ సందేశ్‌కు గాయాలు.. `కానిస్టేబుల్` సినిమా షూటింగ్లో ప్రమాదం!
Latest Update on Varun Sandesh Accident in Shooting: టాలీవుడ్ నటుడు యువ హీరో వరుణ్ సందేశ్ ప్రమాదానికి గురయ్యాడు. ఓ షూటింగ్ సందర్భంగా ప్రమాదం సంభవించి గాయపడటంతో తక్షణం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Latest Update on Tollywood Actor Varun Sandesh Injured in Shooting: తెలుగు చలన చిత్రపరిశ్రమలో యంగ్ హీరో వరుణ్ సందేశ్‌కు గాయాలయ్యాయి. ది కానిస్టేబుల్ సినిమా షూటింగ్ సందర్భంగా వరుణ్ సందేశ్ గాయపడ్డాడు. సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా వరుణ్ సందేశ్‌కు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాలికి తీవ్రమైన గాయమైనట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే వరుణ్ సందేశ్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాలికి బలమైన గాయం అవడంతో మూడు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. ఫలితంగా ది కానిస్టేబుల్ సినిమా షూటింగ్ నిలిచిపోయింది.
హ్యాపీ డేస్ సినిమాతో తెరంగేట్రం చేసిన వరుణ్ సందేశ్ కొత్త బంగారు లోకం సినిమాతో రెండవ హిట్ కొట్టాడు. ఆ తరువాత సినిమాలు పెద్దగా రాణించకపోయినా మంచి హీరోగా గుర్తింపు పొందాడు. వరుణ్ సందేశ్‌కు గాయం అవడంతో షూటింగ్ అర్ధంతరంగా వాయిదా వేయాల్సి వచ్చిందని దర్శకుడు ఆర్యన్ శుభాన్ తెలిపారు. ఓ కానిస్టేబుల్ జీవిత కధ ఆధారంగా నడిచే ఈ సినిమా ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ది కానిస్టేబుల్ సినిమాకు నిర్మాతగా బలగం జగదీష్ ఉన్నారు.
Also Read: Bollywood Actors: యాక్టింగ్, సింగింగ్ ప్రావీణ్యం ఉన్న మల్టీ ట్యాలెంటెడ్ బాలీవుడ్ స్టార్స్
హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం సినిమాలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఓ ఇమేజ్ సంపాదించుకున్న వరుణ్ సందేశ్ ఆ తరువాత ఎందుకో కొనసాగించలేకపోయాడు. సరైన హిట్స్ లేక అవకాశాలు కోల్పోయాడు. గత ఏడాది బిగ్‌బాస్‌లో భార్యతో కలిసి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఇటీవల విడుదలైన ఇందువదన సినిమా కూడా పెద్దగా ఆడలేదు.
Also Read: Adipurush Controversy: ఆదిపురుష్ సినిమాలో హనుమంతుడి డైలాగ్ మారిందిగా, ఎలా మారింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి