Samantha still continue her friendship with stylist Preetham Jukalkar: టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య, స్టార్ హీరోయిన్ సమంత విడిపోవడం గతేడాది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు సామ్ సోషల్ మీడియా ద్వారా పంచుకుని అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చారు. టాలీవుడ్‌ మోస్ట్‌ క్యూటెస్ట్‌ కపుల్‌గా పేరు సంపాదించుకున్న ఈ జంట ఎందుకు విడిపోయారో ఇప్పటికీ ఏ క్లారిటీ లేదు. అటు చై కానీ, ఇటు సామ్ కానీ ఎప్పుడూ పెదవి విప్పలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎప్పుడైతే సమంత విడాకులు అధికారికంగా ప్రకటించారో.. అప్పటినుంచి ఆమె పట్ల రకరకాల రూమర్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్‌తో సమంత సన్నిహితంగా ఉండడం వల్లనే చైసామ్ విడిపోయారంటూ రూమర్లు కూడా చక్కర్లు కొట్టాయి. ఆసమయంలో సామ్, ప్రీతమ్ పేర్లు ట్రెండ్ అయ్యాయి. అయితే ప్రీతమ్‌ సమంతను 'అక్కా' అని పిలుస్తాడని ఆమె సన్నిహితులు చెప్పారు. అయినా కూడా ఆ వార్తలకు పులిస్టాప్ పడలేదు. 


నాగ చైతన్యతో విడాకులు తీసికోవడానికి స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కరే కారణమని నెట్టింట వార్తలు వచ్చినా.. సమంత మాత్రం అవేమీ పట్టించుకోలేదు. ప్రీతమ్‌తో తన స్నేహ బంధాలను మాత్రం తెంచుకోలేదు. ప్రీతమ్‌ ఎప్పటిలానే సమంతకు హెయిర్ స్టైలిస్ట్ గా ఉన్నాడు. ఇటీవల ఒక అవార్డుల కార్యక్రమంలో సమంతతో కలిసి అతడు కూడా వెళ్లాడు. అంతేకాదు తాజాగా ప్రీతమ్‌కి సామ్ హెయిర్‌కట్ కూడా చేశారు. ఇందుకు సంబందించిన పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. 


తన స్టైలిస్ట్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌కి సమంత హెయిర్‌ కట్‌ చేసి ఆ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేశారు. 'నేను మల్టీటాలెంట్‌ని. నేను చేసిన పనికి నువ్‌ ఇంకా నాకు డబ్బులు చెల్లించలేదు' అని సామ్ కాప్షన్ ఇచ్చారు. దీనికి ప్రీతమ్‌ కూడా 'చంపెయ్‌' అంటూ ఫన్నీగా బదులిచ్చాడు. కొంతమంది వ్యక్తులు చేసిన నిరాధారమైన ఆరోపణలతో ప్రీతమ్‌తో తన స్నేహాన్ని మరియు అతని కెరీర్‌ను సామ్ నాశనం చేయలేదు. సామ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 


Also Read: Women's IPL: వచ్చే ఏడాది 6 జట్లతో ఐపీఎల్.. స్పష్టం చేసిన సౌరవ్ గంగూలీ!!


Also Read: Petrol Price Today: మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డిజీల్‌ ధరలు.. ఐదు రోజుల్లో రూ. 3.10 పెరిగిన పెట్రోల్‌ రేట్!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook