Tollywood Heroines: సాధారణంగా ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే అందులో నటించే హీరో హీరోయిన్లు భారీ సాహసాలు చేయాల్సి ఉంటుంది.  ముఖ్యంగా ఒక్కొక్కసారి రిస్క్ చేసి ప్రాణాలు మీదకు తెచ్చుకున్న సందర్భాలు కూడా ఉంటాయి.. ఇకపోతే మరికొంతమంది హీరోయిన్లు పాత్రకు న్యాయం చేయాల్సి వచ్చినప్పుడు అసలు ఇది తమ కెరీర్ కు ఎలా ప్రభావితం చూపిస్తుంది అనే విషయాలను ఏమాత్రం ఆలోచించకుండా,  సాహసాలు చేసి అందరినీ ఆశ్చర్యపరచడమే కాదు సినిమా విజయంలో తమ వంతు కష్టపడ్డారు కూడా.. మరి సినిమాల కోసం అత్యంత పెద్ద రిస్కులు చేసిన హీరోయిన్స్ ఎవరు ఇప్పుడు చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమంత..


రంగస్థలం సినిమాలో సమంత బర్రెలు కడిగిన సన్నివేశం అందరికీ తెలిసిందే.  అయితే ముందుగా ఈ పాత్రలో ఒక డూప్ ని పెట్టి చేద్దామని దర్శకులు అనుకున్నారట.. ఎందుకంటే ఆమె ఒక స్టార్ హీరోయిన్.. ఆమెతో ఇలా బర్రెలు కరిగించడం చూస్తే అభిమానులు హర్ట్ అవుతారని అనుకున్నారు. కానీ సమంత మాత్రం తానే స్వయంగా చేస్తానని బురదలోకి దిగి మరి తన చేతులతో బర్రెలను శుభ్రం చేసింది. మొత్తానికి అయితే పెద్ద సాహసమే చేసింది స్టార్ హీరోయిన్ సమంత. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకొని వీరికి మంచి గుర్తింపును కూడా అందించింది. 


పూర్ణ..


సాహసోపేతమైన పాత్రలు చేయడంలో పూర్ణ ఎప్పుడు ముందుంటుంది ఈ నేపథ్యంలోనే ఒక తమిళ సినిమా కోసం ఏకంగా గుండు కొట్టించుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. సాధారణంగా గుండు కొట్టించుకోవడానికి హీరోలు కూడా వెనకాడుతూ ఉంటారు. అలాంటిది పూర్ణా ఒక హీరోయిన్ అయి ఉండి అందులోను భారీ పాపులర్ ఉన్న ఈమె ఇలా గుండు కొట్టించుకొని సాహసమే చేసింది. ఇక బలమైన పాత్ర కావడంతో ఇలాంటి సాహసం చేసిందని సమాచారం. 


సప్తమి గౌడ..


కాంతారా  సినిమా ఏ రేంజ్ లో విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇందులో సప్తమి గౌడ పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించింది. అంతేకాదు ఈ సినిమాలో తన పాత్ర కోసం ముక్కుపుడక కూడా కుట్టించుకుంది. క్యారెక్టర్ ను మరింత బలం చేయడానికి నొప్పిని కూడా భరించింది. ఈ ముద్దుగుమ్మ. 


కీర్తి సురేష్..


మహానటి సినిమా కోసం.. కీర్తి సురేష్ పరిణశ్రమ అంతా ఇంతా కాదు. ఆ సినిమా కోసం కీర్తి సురేష్ గంటలు తడబడి మెకప్ వేసుకుంది. అంతేకాకుండా కొన్నిసార్లు లావు అయింది.. కొన్నిసార్లు బక్క చిక్కింది. నిజంగానే సావిత్రి తిరిగి వచ్చిందేమో అనేటట్లు.. ఆ పాత్రకు జీవం పోసింది ఈ హీరోయిన్. ఇందులో నటనకు గాను ఈ హీరోయిన్ కి నేషనల్ అవార్డు సైతం వచ్చింది. 


అనుష్క..


అనుష్క జీరో సైజ్ కోసం చేసిన రిస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు 30 కేజీల పాటు.. వెయిట్ గైన్ అయింది అనుష్క. ఆ తరువాత తనకు బరువు తగ్గడానికి ఎన్నో రోజులు పట్టింది. కానీ ఒక్క సినిమా కోసం అనుష్క చేసిన ఇంత పెద్ద రిస్క్.. మరి హీరోయిన్ ఇప్పటివరకు చేయలేదేమో.


మొత్తానికైతే వీరంతా కూడా సినిమాలలో తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయడం కోసం ఇలాంటి పెద్ద పెద్ద సాహసాలు చేశారని చెప్పవచ్చు.


Read more: Telangana: ఫుల్ జోష్ లో గులాబీ బాస్.. కాంగ్రెస్ నుంచి మళ్లీ  బీఆర్ఎస్ లోకి ఆ ఎమ్మెల్యేలు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter