Telangana: ఫుల్ జోష్ లో గులాబీ బాస్.. కాంగ్రెస్ నుంచి మళ్లీ బీఆర్ఎస్ లోకి ఆ ఎమ్మెల్యేలు..

Congress To BRS: తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు క్యూ కట్టారు. ఈ క్రమంలో తాజాగా, కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యే మరల యూటర్న్ తీసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Jul 30, 2024, 06:25 PM IST
  • సొంత గూటీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..
  • ఫుల్ జోష్ లో గులాబీ బాస్..
Telangana: ఫుల్ జోష్ లో గులాబీ బాస్.. కాంగ్రెస్ నుంచి మళ్లీ  బీఆర్ఎస్ లోకి ఆ ఎమ్మెల్యేలు..

Brs has welcomed back mlas who previously left their party: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి దాక బీఆర్ఎస్ టికెట్ మీద గెల్చిన అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసిన నేతలు కాంగ్రెస్ లోకి చేరిపోయారు. దీంతో తెలంగాణ లో బీఆర్ఎస్ పార్టీ ఖతం అయిపోతుందని కూడా జోరుగా చర్చ జరిగింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు సైతం.. పార్టీని వదిలి వెళ్లిన వారిపైన ఘాటు వ్యాఖ్యలు చేశారు.  ఈ క్రమంలో.. ప్రస్తుతం తెలంగాణ లో అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి.

Read more: Snake: నాగ పంచమికి ముందు అరుదైన ఘటన.. నాగ దేవత విగ్రహం మీద నాగు పాము.. వీడియోవైరల్..

అసెంబ్లీలో కాంగ్రెస్, బీజేపీలు నువ్వా.. నేనా.. అన్నట్లు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వం హయాంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అదే విధంగా.. బీఆర్ఎస్ నేతలు సైతం గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా.. అపోసిషన్ పార్టీ నుంచి అధికారంలో ఉన్న పార్టీలోకి నేతలు వలసలు పోవడం కామన్ గా జరిగేదే. కానీ తొలిసారి ఇక్కడ.. అధికార పార్టీలో నుంచి తిరిగి సొంత గూటికి ఎమ్మెల్యే చేరుకున్న ఘటన చోటు చేసుకుంది.

పూర్తి వివరాలు..

ఇటీవల బీఆర్ఎస్‌ను వీడి అధికార కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలంతా ఇప్పుడు మరల సొంతగూటి వైపు చూస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి.. కాంగ్రెస్ వొద్దు బీఆర్ఎస్‌లోనే ఉంటానంటూ యూటర్న్ తీసుకున్నారు.  ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. మరల సొంత పార్టీలోకి వచ్చేశారు. మంగళవారం నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన ఆయన.. తాను మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులంతా ఆనందం వ్యక్తంచేశారు.

Read more: Heart Attack: పాములకు గుండెపోటు వస్తుందా..?.. గిల గిల కొట్టుకుంటూ చనిపోయిన పాము.. వీడియో వైరల్..

ఇదిలా ఉండగా..  కృష్ణమోహన్ ఘర్‌వాపసీతో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగలగా.. బీఆర్ఎస్‌లో జోష్ పెంచిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు పార్టీని వీడి వెళ్లిన మిగతా ఎమ్మెల్యేలను సైతం తిరిగి వస్తారని కూడా బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.  ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ సైతం మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని తెల్లం వెంకట్రావ్ కలిశారు. అనంతరం కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఇవాళో రేపో ఆయన కూడా బీఆర్ఎస్‌లోకి పునరాగమనం చేస్తారని గట్టి ప్రచారమే నడుస్తోంది. ఈ  వరుస ఘటనలు మాత్రం బీఆర్ఎస్ లో ఒకింత జోష్ ను నింపుతున్నాయని చెప్పుకొవచ్చు. మరికొందరు కాంగ్రెస్ లో చేరిన నేతలు.. కూడా బీఆర్ఎస్ నేతలతో టచ్ లో ఉన్నారని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x