Suma Kanakala reentry: సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న యాంకర్ సుమ
Suma Kanakala reentry into Cinemas:వర్షం వంటి చిత్రాల్లో సిస్టర్స్ పాత్ర పోషించిన సుమ సహ నటిగా అప్పుడప్పుడు మెరిసారు. చివరిగా ఆమె ఓ బేబీలో టీవీ యాంకర్‌గా కనిపించారు. అయితే పూర్తి స్థాయిలో ఆమె నటించిన సినిమాలు మాత్రం ఈ మధ్య లేవు.
Tollywood Anchor Suma Kanakala reentry into Cinemas: యాంకరింగ్‌లో తనకు సాటి లేరు ఎవరూ అనే విధంగా ముందుకు సాగుతోంది యాంకర్ సుమ. సినిమా కార్యక్రమాలు, ఆడియో ఫంక్షన్స్, ఈవెంట్స్ అంటే యాంకర్‌గా సుమ (Anchor Suma) ఉండాల్సిందే అనేలా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది సుమ.
బుల్లితెర రారాణిగా ఓ వెలుగు వెలుగుతున్న సుమ నవ్వుతూ.. నవ్విస్తూ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది. స్టేజ్‌పై సుమ ఉందంటే చాలు అక్కడ నవ్వులు గ్యారెంటీ. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లలోనూ (Pre-release events) ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. టాప్ హీరోలు సైతం ఆమెపై ప్రశంసలు కురిపిస్తుంటారు.
అయితే చాలా మంది యాంకర్స్‌గా వీలు చిక్కినప్పుడల్లా వెండితెరపై మెరుస్తున్నారు. కానీ సుమ మాత్రం చాలా రోజులుగా యాంకరింగ్‌తోనే (Anchoring) ఫుల్ బిజీగా ఉంటోంది. గతంలో పలు మూవీలో నటించింది సము. వర్షం వంటి చిత్రాల్లో సిస్టర్స్ పాత్ర పోషించిన సుమ సహ నటిగా అప్పుడప్పుడు మెరిసారు. చివరిగా ఆమె ఓ బేబీలో టీవీ యాంకర్‌గా కనిపించారు. అయితే పూర్తి స్థాయిలో ఆమె నటించిన సినిమాలు మాత్రం ఈ మధ్య లేవు. ఈ క్రమంలో సుమ త్వరలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుందంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
Also Reda : Huzurabad By Election Result Live Counting: ఈటెల రాజేందరే హుజురా 'బాద్‍షా'..ఉపఎన్నికల్లో బీజేపీ ఘన విజయం
తాజాగా ఆమె వెండితెర రీఎంట్రీపై క్లారిటీ వచ్చింది. దీనిపై సుమ ఓ వీడియో ద్వారా తన స్టైల్లో క్లారిటీ ఇచ్చారు. పలువురు సెలబ్రిటీలు తన గురించి మాట్లాడిన వీడియో క్లిప్స్ కట్ చేసి ఓ వీడియో రెడీ చేసింది సుమ. ఇంతమంది అడుగుతున్నారంటే చేసేస్తే పోలే అంటూ సుమ సినిమా రీఎంట్రీ (Suma reentry into Cinema) గురించి క్లారిటీ ఇచ్చింది.
ఈ వీడియో పీఆర్‌ఓ దుద్ది శ్రీను తన ట్విటర్‌లో పంచుకున్నాడు. మరి సుమ (Suma) ఎలాంటి పాత్రతో రీఎంట్రీ ఇవ్వనుందనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచిచూడాలి.
Also Read : Shyam Singha Roy promo: శ్యామ్ సింగ రాయ్ నుంచి రైజ్ ఆఫ్ శ్యామ్ ప్రోమో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook