అందం, అభినయం రెండింటినీ సొంతం చేసుకున్న ఉత్తరాది నటి రకుల్ ప్రీత్‌సింగ్ తెలుగులో చాలా మంచి పేరే తెచ్చుకుంది. ఇటీవల ఎందుకో సినిమా అవకాశాలకు దూరంగా ఉంది. ఇప్పుడు ఒక్కసారిగా అభ్యంతరకర పాత్రతో రకుల్ ప్రీత్‌సింగ్ బోల్డ్ సినిమా విడుదలకు సిద్ధమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగులో కెరటం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఉత్తరాది నటి రకుల్ ప్రీత్‌సింగ్ వరుస అవకాశాలు దక్కించుకుని అగ్రహీరోలందరితో నటించింది. లౌక్యం, నాన్నకు ప్రేమతో, ధృవ వంటి హిట్ సినిమాలు కూడా ఆమె ఖాతాలో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఎందుకో రకుల్ ప్రీత్‌సింగ్‌కు సినిమా అవకాశాలే రావడం లేదనే టాక్ విన్పిస్తోంది. తెలుగులో అయితే ప్రస్తుతం ఆమె ఏ సినిమాలు చేయడం లేదనేది వాస్తవం. టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లిన రకుల్ ప్రీత్‌సింగ్‌కు అజయ్ దేవగణ్, సిద్ధార్ధ్ మల్హోత్రా సినిమాల్లో మంచి అవకాశాలొచ్చినా..ఆకట్టుకోలేకపోయింది. రన్ వే 34 సినిమా కూడా హిట్ కాలేదు. 


ఒకప్పుడు సినిమాకు కోటి 50 లక్షలు తీసుకున్న రకుల్ ప్రీత్‌సింగ్ ఇప్పుడు అవకాశాల్లేక  రోజుకు 3 లక్షల పారితోషికం తీసుకుంటుందని తెలుస్తోంది. ఇప్పుడామె తాజాగా ఛత్రివాలి అనే బోల్డ్ హిందీ సినిమాలో నటించింది. అది కూడా ఓ అభ్యంతకర పాత్రలో. ఈ మధ్యనే ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్‌సింగ్ కండోమ్ క్వాలిటీ చెక్ చేసే పాత్రలో నటిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రోనీ స్క్రూవాలా నిర్మించిన ఈ సినిమా నేరుగా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. జనవరి 20, 2023న స్ట్రీమింగ్ కానుంది. 


సినిమా అవకాశాల్లేక అటు పారితోషికం తగ్గించుకుని డైలీ పేమెంట్స్‌తో పని చేస్తోందని..మరోవైపు అభ్యంతరక పాత్రల్ని ఒప్పుకుంటోందని బాలీవుడ్ , టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. 


Also read: Poonam Kaur fibromyalgia : పూనమ్ కౌర్‌కు అరుదైన వ్యాధి.. ఇంతగా బాధపడుతోందా?.. అసలేం జరిగిందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook