Uppena sequel: ఉప్పెన సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. నీ కళ్లు నీలి సముద్రమంటూనే కెరటాలు ముంచెత్తాయి. మనసు నిజంగానే ఆ కెరటాల్లో ప్రవహిస్తూనే ఉంది. ఇప్పుడు మరో ఉప్పెనకు సిద్ధంగా ఉన్నారా..అంటే సీక్వెల్ రానుందా..అవును నిజమే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒక్కరు తప్ప అంతా కొత్తవాళ్లే. దర్శకుడు, హీరో, హీరోయిన్ అంతా కొత్త పరిచయాలే. విలన్‌గా విజయ్ సేతుపతి తప్ప అందరూ తొలిసారిగా తెరంగేట్రం చేసినవారే.  స్టార్ దర్శకుడు సుకుమార్ ( Director Sukumar ) శిష్యుడిగా దర్శక బాధ్యతలు తీసుకున్న బుచ్చిబాబు( Buchibabu ).. తొలి సినిమాతోనే బంపర్ హిట్ కొట్టేశాడు. ఇక హీరోగా మెగాస్టార్ మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ మేనరిజం, అభినయం సరిగ్గా పాత్రకు సరిపోయింది. అన్నింటికి మించి సినిమా సక్సెస్‌కు మరో కారణం హీరోయిన్ కృతి శెట్టి. అద్భుతమైన హావభావాలు, అభినయం, లుక్స్ తొలి సినిమాతోనే అదరగొట్టేసింది. కన్నడ భామ కృతిశెట్టి ( Kritisetty )..తెలుగులో ఈ సినిమాతో బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. 


ఉప్పెన ( Uppena Movie )అంతలా విరుచుకుపడటానికి కారణం సంగీతమే. ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు స్వయంగా అంగీకరించాడు. సంగీతమే సినిమాను ముందుకు తీసుకెళ్లిందని చెప్పాడు. దేవీ శ్రీ ప్రసాద్ ( Devi sri prasad )అందించిన అద్భుత సంగీతం, బాణీల ఉప్పెనలా ప్రవాహమై సాగాయని..ఆ ప్రవాహంలో తామూ వెళ్లామని అంటున్నారు బుచ్చిబాబు, వైష్ణవ్ తేజ్ ( Vaishnav tej )‌లు. ఇది నిజమే. విభిన్నమైన లవ్ స్టోరీతో సాగిన కధకు బలం చేకూర్చింది దేవి అందించిన సంగీతమే. తెలుగు, హిందీ బాణీలతో సరికొత్తగా ఆలపింపచేసిన నీ కళ్లు నీలి సముద్రం పాట ( Nee kallu neeli samudram song ) ఇప్పటికీ ఉప్పెనలా విరుచుకుపడుతూనే ఉంది. 


ఇప్పుడు మరో కొత్త సంచలన విషయమేమంటే మరో ఉప్పెన రాబోతుందట. నిజమే..దర్శకుడు బుచ్చిబాబు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. వాస్తవం ఏంటంటే..ఉప్పెన 2 (Uppena 2 )ను ఊహించుకున్న తరువాతే ఉప్పెన 1( Uppena 1 ) కధ రాసుకున్నాడట బుచ్చిబాబు. ఉప్పెన 2 కధ నిజంగా సరికొత్తగా ఉండబోతుందట. ఉప్పెన 2ను బట్టి రాసుకున్న కధ ఉప్పెన 1 ఇంత హిట్ అయితే..ఇక మరో ఉప్పెన ఇంకెంత విధ్వంసం సృష్టించనుందో. సో లెటజ్ వెయిట్ ఫర్ ఉప్పెన సీక్వెల్ (Uppena sequel ).


Also read: Sunny leone: Valentines day special సన్నీ లియోన్ లేటెస్ట్ లుక్ చూద్దామా, వైరల్ అవుతున్న ఫోటోలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook