Tollywood celebrities on Konda Surekha Controversy: తెలుగు చలనచిత్ర పరిశ్రమపై గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణలు నిజంగా ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయని చెప్పాలి. అసలు విషయంలోకి వెళ్తే తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ పై ఉన్న కోపాన్ని సినీ సెలబ్రిటీల పైన చూపించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సమంత - నాగచైతన్య విడిపోవడానికి కేటీఆర్ ప్రధాన కారణం అని  అంతేకాదు సినీ సెలబ్రిటీలు త్వరగా పెళ్లిళ్లు చేసుకొని ఇండస్ట్రీకి దూరం అవడానికి కూడా కారణం కేటీఆర్ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసింది.  మత్తు మందుకు బానిస అయ్యి అతడితోపాటు చాలామంది హీరోయిన్స్ ను మత్తుకు బానిసలను చేసి వారిని బ్లాక్మెయిల్ చేస్తూ ఇండస్ట్రీ నుంచి దూరం చేస్తున్నాడు అంటూ కేటిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఈ వివాదాల్లోకి సినీ సెలబ్రిటీలను లాగడంతో సినీ సెలబ్రిటీలు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. 


ముఖ్యంగా సమంతను టార్గెట్ చేస్తూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్  ఎన్టీఆర్  నాని సింగర్ చిన్మయి నాగార్జున  అమల ఇలా చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొండా సురేఖకు డైరెక్ట్ గా వరుస ట్వీట్లు చేశారు. దెబ్బకు దిగి వచ్చిన కొండా సురేఖ సమంత కు క్షమాపణలు చెప్పింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సినీ సెలబ్రిటీల పైన రాజకీయ నాయకులు ఇదే ధోరణి లో వ్యాఖ్యలు చేస్తున్నా ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ మొదటిసారి సమంత కోసం సినీ ఇండస్ట్రీ నిలబడడం నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. 
 
అసలు విషయంలోకి వెళ్తే.. ఎన్టీ రామారావు కుమార్తె ను అవమానించినప్పుడు మనకెందుకులే అని సినీ ఇండస్ట్రీ వదిలేసింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను తిట్టినప్పుడు మెదలకుండా ఉండిపోయింది. చిరంజీవిని అవమానిస్తే అసలు పట్టించుకున్న వాళ్లే లేరు. ఇలా ప్రతిసారి కూడా మనల్ని కాదులే.. మనం బాగానే ఉన్నాం కదా.. మనకెందుకు ఈ గొడవలు అని చాలామంది ఆలోచించారు.  అందుకే ఇండస్ట్రీ అంటే లోకువ అయిపోయింది. వీళ్లను ఏమైనా అనొచ్చు  అసలు వీళ్ళకి రోషమే రాదు అనే లోకువ..ఈరోజు ఏకంగా అక్కినేని కుటుంబం మీద అత్యంత చీప్ కామెంట్లు చేసే స్థాయికి తీసుకొచ్చింది అని చెప్పవచ్చు.


ఇక ఇన్ని రోజులు ఊరుకున్న సెలబ్రిటీలు ఒక్కసారిగా సమంతపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తిరగబడ్డారు. మొత్తానికైతే ఇది సమంత మంచితనమే అని ..అందుకే ఆమెకు ఇండస్ట్రీ అండగా నిలబడింది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి