Tollywood: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ మారుతికి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి 76 ఏళ్ల కుచలరావు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కన్నుమూశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మారుతి తండ్రి ఇకలేరు. 76 ఏళ్ల కుచలరావు మచిలీపట్నంలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. గత కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మరణంతో మారుతి కుటుంబంలో విషాదం అలముకుంది. మారుతి తండ్రి మరణవార్త విన్న సినీ ప్రముఖులు  ఫోన్ ద్వారా ప్రగాఢ సానుభూతి వ్యక్తపరుస్తున్నారు. 


మారుతి ప్రారంభంలో సహ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. ఈరోజుల్లో సినిమాతో దర్శకుడిగా మారిన మారుతి...ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు. నాగచైతన్య, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వెంకటేశ్, నాని, శర్వానంద్ ‌ చేసిన సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. త్వరలో గోపీచంద్‌తో మరో సినిమా రానుంది.


Also read: Weekend Movie Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న చిత్రాలివే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook