Tollywood Director Anjaneyulu Death News: టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. సీనియర్ దర్శకుడు, నటుడు ఓఎస్ఆర్ ఆంజనేయులు(79) కన్నుమూశారు. వయసురీత్యా అనారోగ్య సమస్యలతో గత కొంతకాలం నుంచి ఆయన ఇబ్బంది పడుతున్నారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆంజనేయులు శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


నాటకరంగం నుంచి సినీరంగానికి పరిచయం అయిన ఆంజనేయులు... సూపర్ స్టార్ కృష్ణ (Krishna), విజయనిర్మల, వి రామచంద్రరావు, కె.హేమాంబదరరావు, కేఎస్, ఆర్.దాస్ తదితరుల దగ్గర పలు సినిమాలకు దర్శకత్వశాఖలో పనిచేశారు. చిరంజీవి నటించిన ‘లవ్ ఇన్ సింగపూర్’ సినిమాతో పాటు కన్నెవయసు మూవీకి దర్శకత్వం వహించారు. 


Also Read: Tollywood టాప్ 5 హీరోలు వీరే.. ఎంత మంది ఫాలో అవుతున్నారంటే!



దాదాపు 70కి పైగా సినిమాలలో ఆంజనేయులు నటించారు. పలువురు ప్రముఖ హీరోల సినిమాలలో పాత్రలు దక్కించుకున్నారు. టాలీవుడ్ (Tollywood) సీనియర్ దర్శకుడు, నటుడు ఓ.ఎస్.ఆర్.ఆంజనేయులు మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.


Also Read: Bigg Boss 4 Telugu Funny Memes: బిగ్ బాస్ 4 ఫైనల్ తర్వాత వైరల్ అవుతున్న మీమ్స్ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook