Director P Chandrasekhar Reddy Passed Away: టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ పి.చంద్రశేఖర్‌రెడ్డి(86) (P Chandrasekhar Reddy) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన..ఈ రోజు ఉదయం 8.30 గంటలకు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. సుమారు 80 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు చిత్రాలకు ఈయన దర్శకత్వం వహించారు. సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) చిత్రాలతో ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది. మానవుడు దానవుడు, కొడుకులు, జగన్నాయకుడు, బడిపంతులు, విచిత్ర దాంపత్యం, రగిలే గుండెలు, నవోదయం, పాడిపంటలు, బంగారు కాపురం తదితర చిత్రాలకు పి.సి.రెడ్డి దర్శకత్వం వహించారు. పీసీ రెడ్డి మృతికి పలువురు (Tollywood) సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పీసీరెడ్డి ప్రస్థానం


1933, అక్టోబర్ 15వ తేదీన నెల్లూరు జిల్లాలో జన్మించారు పీసీ రెడ్డి. 1959లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీరంగ ప్రవేశం చేశారు. వి.మధుసూధనరావు, ఆదుర్తి సుబ్బారావు వంటి దర్శక దిగ్గజాల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు. సూపర్‌స్టార్‌ కృష్ణ, విజయనిర్మల జంటగా నటించిన ‘'అనురాధ'’అనే సినిమాకు తొలిసారి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈయన తీసిన ‘'మానవుడు దానవుడు’' చిత్రం ద్వారా శోభన్‌బాబుకు మంచి మాస్ ఇమేజ్ వచ్చింది. ఎన్టీఆర్‌తో (NTR) పీసీ రెడ్డి రూపొందించిన ‘'బడిపంతులు’' తెలుగు సినిమా చరిత్రలో ఒక పెద్ద ప్రయోగమనే చెప్పాలి. ఈ సినిమాలో హీరోయిన్‌ శ్రీదేవి (Actress Sridevi) ఎన్టీఆర్‌ మనవరాలి పాత్రలో నటించింది. 


Also Read: Mohan babu: 'సినీ పరిశ్రమలో అందరూ సమానమే.. కలిసి సినిమాని బతికిద్దాం'


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి