Mohan babu: తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితులపై స్పందించారు సీనియర్ నటుడు మోహన్ బాబు. కలిసి సినిమాను బతికిద్దామని పిలుపునిచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా సుదీర్ఘ బహిరంగ (Mohan babu open latter to Tollywood) లేఖ రాశారు.
మోహన్ బాబు ఏమన్నారంటే..
తాను ఈ విషయంపై స్పందించే విషయంపై తనకు సన్నిహితులు వారించారని అయితే వాళ్లు చెప్పినట్లు వినాలా? నాలా బతకాలా అనే విషయానికి సమాధానంగానే లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు మోహన్ బాబు.
'సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్స్, నలుగు డిస్ట్రిబ్యూటర్స్ కాదు.. (Mohan babu on Cinema Industry) కొన్ని వేలమంది ఆశలు, కొన్నివేల కుటుంబాలు.. కొన్ని వేల జీవితాలు..
47 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాట.. అందరి జీవితాలతో ముడిపడిన ఈ సినిమా ఇండస్ట్రీ గురించి మనకు ఉన్న సమస్యల గురించి ముఖ్యమంత్రలకు వివరించాలనుకుంటే అందరూ కలిసి ఒక్కచోట సమావేశమై సమస్యలు ఏంటి, పరిష్కారాలు ఏంటి.. ఏది చేస్తే సినీ పరిశ్రమకి మనుగడ ఉంటుంది. అని చర్చించుకోవాలి.' లేఖలో పేర్కొన్నారు మోహన్ బాబు.
అలా వెళ్లడం ఏమిటి?
సమస్యల గురించి తమలో తాము చర్చించుకున్న తర్వాత మాత్రమే సినిమాటోగ్రఫి మంత్రుల్ని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసిగట్టుగా (Mohan babu on Cinema industry problems)కలవాలన్నారు.
అలా కాకుండా, నలుగుర్నే రమ్మన్నారు, ప్రొడ్యూసర్స్ నుంచి నలుగురు, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఓ ముగ్గురు, హీరోల నుంచి ఇద్దరు వెళ్లటం ఏమిటని ప్రశ్నించారు. సినీ పరిశ్రమలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదని.. అందరూ సమానమేనని ఆయన ఉద్ఘాటించారు. చిన్న నిర్మాతలను కూడా కలుపుకుని ముఖ్యమంత్రులను కలిసి ఉంటే.. ఈ రోజు ఇన్ని కష్టాలు వచ్చేవి కావని అభిప్రాయపడ్డారు మోహన్ బాబు.
అప్పుడలా చేశాం..
మోహన్ బాబు 'మా' అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పరిశ్రమలోని ప్రముఖులందరితో కలిసి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని కలిసినట్లు గుర్తు చేసుకున్నారు. పైరసీ కోరల్లో సినిమా నలిగి పోకుండా తమపై దయ చూపాలని ఆయన్ను కోరినట్లు తెలిపారు. ఆయితే ఈ మాటలు అప్పట్లో చాలా మందికి నచ్చకపోయినా.. ఆయన్ను (ముఖ్యమంత్రిని) కదిలించాయని పేర్కొన్నారు.
ఇంకా ఏమన్నారంటే..
రూ.350, రూ.300 టికెట్లతో చిన్న సినిమాలు నిలబడటం కష్టమని.. అదే విధంగా రూ.50, రూ.30 టికెట్లతో పెద్ద సినిమాలు నిబడటం కూడా కష్టమేనని మోహన్ బాబు (Mohan babu on Ticket Price Issue) పేర్కొన్నారు.
చిన్న సినిమాలు ఆడాలి, పెద్ద సినిమాలు ఆడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి అయ్యా మా సినీ రంగం పరిస్థితి ఇది.. అని వివరించి న్యాయం చేయమని కోరుదామన్నారు.
నిర్మాతలు ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు ఎందుకు మౌనం పాటిస్తున్నారో అర్థం కావట్లేదన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రొడ్యూసర్లంతా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
Also read: Actor crying: తన ఫేవరైట్ హీరోను చూసి బోరున ఏడ్చిన మరో స్టార్ హీరో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook