Tollywood Drugs Case: హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో హీరో నవదీప్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట సోమవారం హాజరయ్యారు. మనీ లాండరింగ్‌కు సంబంధించి నవదీప్‌ బ్యాంకు ఖాతాలను ఈడీ అధికారులు పరిశీలించనున్నారు. అనుమానాస్పద లావాదేవీలు, డ్రగ్స్‌ విక్రేత కెల్విన్‌తో (kelvin) ఉన్న సంబంధాల గురించి ఈడీ అధికారులు ఆరా తీసున్నట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎఫ్‌క్లబ్‌లో జరిగే పార్టీలపై ఆరా తీసున్నట్లు సమాచారం. అక్కడ జరిగే పార్టీలకు రెగ్యులర్‌‌గా హాజరయ్యే సెలబ్రిటీలు, ఆ పార్టీల్లో డ్రగ్స్ సరఫరా చేస్తారా అనే అంశాలపై కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అలాగే సోమవారమే విచారణకు హాజరుకావాల్సిందిగా ఎఫ్‌ క్లబ్‌ (F club) జనరల్‌ మేనేజర్‌కు కూడా ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. దీంతో ఎఫ్‌క్లబ్‌ మేనేజర్‌ని కూడా నేడు ఈడీ అధికారులు విచారించనున్నారు. మొదట ఈ కేసు అంతా డ్రగ్‌ సరఫరాదారుడు కెల్విన్‌ చుట్టూ తిరిగింది. అయితే విచారణ క్రమంలో ఎఫ్‌-క్లబ్‌లో పార్టీలపైనా, ఆ పార్టీల్లో పాల్గొన్నవారి ఆర్థిక లావాదేవీలపైనా ఈడీ అధికారులు దృష్టి సారిస్తూ వచ్చారు. 


Also Read : Andhra Pradesh Petrol Pumps : తస్మాత్ జాగ్రత్త... కళ్లముందే పెట్రోల్ బంకుల్లో మోసాలు


డబ్బుల మళ్లింపులపై ఆరా 


ఇప్పటికే ఈడీ అధికారులు పలువురి సెలబ్రిటీల నుండి వారివారి బ్యాంక్‌ ఖాతాల వివరాలు సేకరించారు. ఈ కేసులో అప్రూవల్ గా మారిన కెల్విన్‌, అతడి స్నేహితుడు, ఈవెంట్‌ మేనేజర్‌ జీషాన్‌అలీల బ్యాంక్‌ఖాతాల్లోకి ఎవరెవరి నుంచి డబ్బుల మళ్లింపులు జరిగాయన్న అంశాలపై ఆరా తీశారు. ఇక ఇప్పటివరకు పూరీ జగన్నాథ్‌, (puri jagannadh) ఛార్మి, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, (rakul preet singh) నందు, రానా, (Rana) రవితేజలను (Raviteja) ఈడీ అధికారులు విచారించారు.


డ్రగ్స్ లావాదేవీలపై ఆరా


అయితే వీరంతా కెల్విన్‌ ఎవరో తెలియదని వాళ్లు విచారణలో చెప్పినట్లు సమాచారం. అయితే నేటి విచారణలో కెల్విన్ తో జరిపి డ్రగ్స్ లావాదేవీల పై నవదీప్‌ను ఆరా తీసినట్లు సమాచారం. నవదీప్‌, ఎఫ్‌-క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ చెప్పే అంశాల ఆధారంగానే టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో (Tollywood Drugs Case) కొత్త అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.


Also Read : Love story trailer: లవ్ స్టోరీ ట్రైలర్.. తెలంగాణ సర్కారుపై Sekhar Kammula సెటైర్ ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook