Swapna Varma suicide in madhapur hyderabad: టాలీవుడ్‌లో ఇండస్ట్రీలో పెనువిషాదం చోటుచేసుకుంది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ(33) ఆత్మ‌హ‌త్య చేసుకుంది. మాదాపూర్‌లో తాను నివాసం ఉంటున్న ప్లాట్‌లో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డినట్లు తెలుస్తోంది. ఆమె ఉంటున్న అపార్ట్ మెంట్ నుంచి దుర్వాసన రావడం, డోర్ ను ఎన్నిసార్లు నాక్ చేసిన కూడా రెస్పాన్స్ లేకపోవడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు డోర్ లను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అప్పుడు దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కాగా, సదరు లేడీ ప్రొడ్యూసర్ రెండు రోజుల క్రితమే బలవన్మరణానికి పాల్పడినట్లు కూడా వెలుగులోకి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..


కొన్నిరోజులుగా సిని ఇండస్ట్రీలో అవకాశాలు లేక తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా..ఆర్థిక ఇబ్బందులతో కూడా సతమతమౌతుంది. ఈ క్రమంలోనే తన గదిలో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా..స్వ‌ప్న వ‌ర్మ సొంతూరు ఏపీలోని రాజ‌మండ్రి. సినీ రంగంలో ప‌నిచేసేందుకు మూడు సంవ‌త్స‌రాల క్రితం ఆమె హైద‌రాబాద్ న‌గ‌రానికి వ‌చ్చింది. 


గ‌త సంవ‌త్స‌రం నుంచి మాదాపూర్‌లోని కావూరి హిల్స్‌లో నివాసం ఉంటన్నారు.  సినీ ఇండస్ట్రీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తుంది. అయితే.. గ‌త కొంత కాలంగా  ఆమెకు ఎలాంటి ప్రాజెక్టులు లేక, ఆమె ఖాళీగా ఉంటుంది. దీంతోనే మనస్తాపానికి గురై.. రెండు రోజు క్రితం త‌న ప్లాట్‌లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఆమె ఉంటున్న ప్లాట్‌నుంచి దుర్వాస‌న వ‌స్తుండటంతో చుట్టుప‌క్క‌ల వారు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.


Read more: Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..


వెంట‌నే పోలీసులు అక్క‌డ‌కి చేరుకుని ప్లాట్ త‌లుపులు ప‌గ‌ల‌కొట్టి చూడ‌గా ఫ్యాన్ కు వేలాడుతూ  ఆమె మృత‌దేహం కనిపించింది. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్ప‌త్రికి తర‌లించారు. ఒక యంగ్ ప్రొడ్యూసర్ ఇలా బలవన్మరణానికి పాల్పడటం పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కొందరు క్షణికావేశంలో, తమ వందేళ్ల జీవితాన్ని ఇలా నాశనం చేసుకుంటున్నారని కూడా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి