India hits 100 crore Covid vaccine milestone: Tollywood Hero Mega Powerstar Ram Charan salutes frontline medical teams for 100 crore vaccination: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భారత్ 100 కోట్ల కోవిడ్ వాక్సినేషన్‌ మైలురాయిని చేరుకోవడంపై స్పందించారు. ఈ హిస్టారిక్ ఫీట్‌పై సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని తెలిపారు చెర్రీ.. భారతదేశం 100 కోట్ల వాక్సినేషన్‌ను (vaccination) విజయవంతంగా పూర్తి చేసుకుందంటూ 'వాక్సినేషన్ సెంచరీ' (VaccineCentury) అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు చరణ్. ఈ హిస్టారికల్ ఫీట్‌ ఘనత సాధించడానికి అహర్నిశలు పని చేసిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ మెడికల్ టీమ్స్ (frontline medical teams) అందరికీ సెల్యూట్ అని పేర్కొన్నారు రామ్ చరణ్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఇండియాపై ప్రశంసలు కురిపించారు చెర్రీ. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : NEET PG 2021 Admissions: పీజీ నీట్ 2021 అడ్మిషన్లకై కౌన్సిలింగ్ మరో రెండ్రోజుల్లో


ఇక రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా శంకర్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు.. ఓ భారీ ప్యాన్‌ ఇండియా మూవీ నిర్మిస్తున్నారు. ఈ మధ్య పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ తాజాగా పుణేలో ప్రారంభమైందని సమాచారం. ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనడానికి చెర్రి మొదట ముంబై వెళ్లి.. అక్కడి నుంచి పుణె వెళ్లారని తెలుస్తోంది.


రామ్‌చరణ్‌–కియారా అద్వానీ (Kiara Advani) షూటింగ్ లో పాల్గొనగా ఓ పాట చిత్రీకరణను ప్లాన్‌ చేశారట. ఈ పాటను పది నుంచి 15 రోజుల పాటు షూట్ చేయనున్నట్లు టాక్. ఈ పాట కోసం పుణేలో భారీ సెట్స్‌ కూడా వేయించారట. రామ్‌చరణ్‌–కియారా (Ram Charan) డ్యూయెట్ షూటింగ్ సాగుతోందని తెలుస్తోంది.


Also Read : Bathukamma: బుర్జ్ ఖలీఫా స్క్రీన్‌పై తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ వైభవం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook