Tollywood Hero Nikhil Siddharth father Shyam Siddharth died: టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇంట పెను విషాదం నెలకొంది. నిఖిల్ తండ్రి కావలి శ్యామ్ ప్రసాద్ సిద్ధార్థ్ ఆనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మధ్యాహ్నం కన్నుమూశారు. శ్యామ్ సిద్ధార్థ్ అకాల మరణంతో హీరో నిఖిల్‌ ఇంట విషాదచాయలు అలుముకున్నాయి. పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'హ్యాపీ డేస్ సినిమాతో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమాలో పల్లెటూరి నుంచి వచ్చిన యువకుడు బీటెక్‌లో జాయిన్ అయ్యి వచ్చిరానీ ఇంగ్లీష్‌తో ప్రేక్షకులను అలరిస్తాడు. యువత, అంకిత్ పల్లవి ఫ్రెండ్స్, ఆలస్యం అమృతం, ఓం శాంతి, కలవర్ కింగ్, వీడు తేడా లాంటి సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. స్వామిరారా సినిమాతో నిఖిల్ మంచి  సక్సెస్ అందుకున్నాడు. 


స్వామిరారా తర్వాత సూర్య వర్సెస్ సూర్య, కేశవ, ఎక్కడికి పోతావ్ చిన్నవాడా, కార్తికేయ, అర్జున్ సురవరం లాంటి సినిమాలతో నిఖిల్ సిద్ధార్థ్ కు హీరోగా మంచి మార్కెట్ ఏర్పడింది. ప్రస్తుతం కార్తికేయ 2, 18 పేజెస్ చిత్రాల్లో నిఖిల్ నటిస్తున్నాడు. 'స్పై' టైటిల్‌తో ఇటీవల ఓ పాన్ ఇండియా సినిమాను కూడా ప్రకటించాడు. ఇప్పుడిప్పుడే కెరీర్ పరంగా మరో ఎత్తుకు వెళుతున్న నిఖిల్‌కు పితృవియోగం కలగడం అందరిని కలిచివేస్తోంది. 


Also Read: Realme GT 2 Offer: రూ.40 వేల విలువైన Realme స్మార్ట్ ఫోన్ ను రూ.17 వేలకే కొనండి!


Also Read: Muttiah Muralitharan Angry: మార్కో జాన్సెన్‌ చెత్త బౌలింగ్‌.. బూతులు తిట్టిన సన్‌రైజర్స్‌ కోచ్‌ (వీడియో)


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.