Pan India Movies: పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ప్రభాస్
Pan India Movies: టాలీవుడ్ హీరో ప్రభాస్ ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్‌పైనే దృష్టి సారించాడు. బాహుబలి తరువాత ప్రభాస్ పాన్ ఇండియా సినిమాల జాబితా ఎక్కువైపోతోంది. ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
Pan India Movies: టాలీవుడ్ హీరో ప్రభాస్ ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్‌పైనే దృష్టి సారించాడు. బాహుబలి తరువాత ప్రభాస్ పాన్ ఇండియా సినిమాల జాబితా ఎక్కువైపోతోంది. ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
తెలుగు సినీ పరిశ్రమ నుంచి బాలీవుడ్ (Bollywood) ఇండస్ట్రీకు వెళ్లిన హీరోలు చాలా తక్కువనే చెప్పాలి. కానీ ప్రభాస్( Prabhas)మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.బాహుబలి (Bahubali) ప్రభంజనం తరువాత సాహో సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో రచ్చచేసిన ప్రభాస్ ఇక ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒకదానితరువాత మరొకటిగా పాన్ ఇండియా సినిమాలకు ఓకే చెబుతున్నాడు. ప్రస్తుతం రాధేశ్యామ్(Radheshyam), తరువాత ఆదిపురుష్(Adipurush)..ఆ తరువాత సలార్. ఇప్పుడు కొత్తగా వార్ ఫేమ్ దర్శకుడు సిద్ధార్ద్ ఆనంద్ దర్శకత్వంలో సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ లొకేషన్‌లో వార్ సినిమా దర్శకుడైన సిద్ధార్ ఆనంద్( Sidharth anand) క్లుప్తంగా ప్రభాస్‌కు కధ విన్పించాడట. సిద్ధార్ధ్ ఆనంద్ చెప్పిన స్టోరీ లైన్‌కు ప్రభాస్ ఇంప్రెస్ అయినట్టు సమాచారం. పూర్తి కధ వినేందుకు మరోసారి కలుద్దామని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ప్రస్తుతం రాధేశ్యామ్ ప్యాచ్‌వర్క్ షూటింగ్ పూర్తయ్యాక..కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ చిత్రం ( Salar movie) షూటింగ్‌లో పాల్గొననున్నాడు ప్రభాస్. వరుస పాన్ ఇండియా సినిమాలతో ( Pan India movies) బిజీగా ఉన్న ప్రభాస్(Prabhas)..ఇక తెలుగు సినీ పరిశ్రమకు వెనక్కి రావడం ఇప్పట్లో కష్టమేనని తెలుస్తోంది.
Also read: Kollywood: తమిళ హాస్యనటుడు వివేక్ గుండెపోటుతో మృతి, పలువురు ప్రముఖుల సంతాపం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook