Ravi Teja: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వేళ.. ఎక్స్ లో ఆసక్తికరంగా పోస్ట్ పెట్టిన మాస్ మహారాజా..
Ravi teja health update: టాలీవుడ్ హీరో రవితేజ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన శస్త్రచికిత్స విజయవంతమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాస్ మహారాజా చేసిన ట్విట్ ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Tollywood hero Raviteja discharged from hospital: హీరో రవితేజ RT75 మూవీలో భాగంగా షూటింగ్ చేసేటప్పుడు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో.. ఆయనను (శుక్రవారం) హుటాహుటీన ఆస్పత్రికి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఆయనకు సర్జరీ కూడా చేశారు. దీంతో ఆయన అభిమానులు రవితేజ ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రవితేజ ఆస్పత్రిలో బెడ్ మీద ఉన్న ఫోటో నిన్న సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఆయన తొందరగా కొలుకోవాలంటూ ఆయన ఫ్యాన్స్ ప్రత్యేకంగా పూజలు సైతం చేశారు.
అంతేకాకుండా..ఆయన సినిమా ఇండస్ట్రీ సైతం .. రవితేజ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. హీరో రవితేజ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఆయన తన హెల్త్ గురించి ఎక్స్ లో అప్ డేట్ ఇచ్చారు. ప్రస్తుతం తాను హెల్తీగానే ఉన్నానని చెప్పారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేసిన వారందరికి , తన అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.. తొందరలోనే మలర సెట్స్ లోకి అడుగుపెట్టేందుకు ఈగర్ గా ఉన్నట్లు పోస్ట్ చేశారు.
దీనిపై నెటిజన్లు కూడా తమ రిప్లై ఇచ్చారు. వెంటనే తమ హీరో కోలుకోవాలంటూ కూడా గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్ లు చేశారు. హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రిలో రవితేజకు సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. #RT75(వర్కింగ్ టైటిల్) మూవీ చిత్రీకరణలో భాగంగా.. గురువారం ఈ ప్రమాదం జరిగింది. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు.
భాను భోగవరపు దర్శకత్వంలో ప్రస్తుతం రవితేజ తన 75వ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూట్‌లో అనుకొని ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో.. రవితేజ కుడిచేతి కండరాలు చిట్టించినట్లుగా తెలుస్తోంది. అయినా కూడా.. రవితేజ షూట్‌లో పాల్గొనడంతో.. గాయం ముదిరింది. దీంతో ఆయనను హుటా హుటీన.. హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్ కు తరలించారు.
రవితేజని గాయాన్ని పరిశీలించిన డాక్టర్స్.. వెంటనే ఆయనకు సర్జరీ చేయాలని చెప్పారు. వెనువెంటనే ఆయనకు వైద్యులు సర్జరీ కూడా పూర్తిచేశారు. మొత్తంగా ఆయనకు ఆరు వారాల పాటు బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్స్ సూచించారని సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook