Venu Thottempudi father passes away:
టాలీవుడ్‌ హీరో వేణు తొట్టెంపూడి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి తొట్టెంపూడి వెంకట సుబ్బారావు (92) కన్నుమూశారు. వేణు తండ్రి ప్రొఫెసర్ గా ఉద్యోగం చేసేవారు. కాగా ఈయన కొద్దిరోజులుగా
వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిసింది. మొన్నటి వరకు ఆయనకు వైద్యులు చికిత్సను అందించారు. ఈ క్రమంలోనే మరోసారి ఆయన ఆరోగ్యం క్షిణించగా ఈరోజు తెల్లవారుజాున ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఈ మేరకు ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోమవారం తెల్లవారుజామున ఆయన మరణించారు అంటూ తెలిపారు. దీంతో వేణు ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. సుబ్బారావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.


వేణు తండ్రి వెంకట సుబ్బారావు మృతదేహాన్ని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సందర్శనకు ఉంచనున్నారు. ఆయన భౌతికాయాన్ని సందర్శనార్ధం ఈరోజు మధ్యాహ్నం 12.00 గంటల వరకూ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని స్టీల్ & మైన్స్ కాంప్లెక్స్‌లో ఉన్న స్వగృహంలో ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత అంటే 12.30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలను నిర్వహించబోతున్నారని తెలుస్తోంది.


ఇక హీరో వేణు విషయానికి వస్తే ఒకప్పుడు స్వయంవరం.. చిరునవ్వుతో సినిమాలతో మన అందరిని ఆకట్టుకున్న హీరో తొట్టెంపూడి వేణు. శ్రీయ తో చేసిన సదా మీ సేవలో సినిమా తరువాత సినిమాల్లో హీరోగా చేయడం తగ్గిస్తూ వచ్చారు. 2013లో వచ్చిన 'రామాచారి' చిత్రం తర్వాత సినీ రంగానికి పూర్తిగా దూరం అయిన వేణు.. మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా దమ్ములో కీలకపాత్రలో కనిపించారు. మరలా ఎక్కువ గ్యాప్ తీసుకుని ఈమధ్య రవితేజ హీరోగా నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. అలాగే, గత ఏడాది 'అతిథి' అనే వెబ్ సిరీస్‌లోనూ నటించాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరికొన్ని ప్రాజెక్టులను కూడా లైన్‌లో పెట్టుకుని ఫుల్ బిజీగా గడుపుతున్నాడు అని వినికిడి.


Also read: Indian Railway New Rules: రైళ్లో లోయర్ బెర్త్ కొత్త రూల్స్, ఇక ఆ సీటు వారిదే


Also read ఇంట్లో ఈ దిక్కున అద్దం పెడితే అదృష్టం.. ఆ ఇంట్లోవారికి ప్రతి పనిలో విజయం..!


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook