Tollywood Hero Vidyasagar Passed Away: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. గతంలో కొన్ని తెలుగు సినిమాల్లో హీరోగా నటించిన నటుడు విద్యాసాగర్ అనారోగ్య కారణాలతో కన్నుమూసినట్లు సమాచారం. ‘ఈ చదువులు మాకొద్దు’ అనే సినిమాతో హీరోగా పరిచయమైన విద్యాసాగర్ ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత కామెడీ సినిమాల దర్శకుడు జంధ్యాల తీసిన చాలా సినిమాల్లో కూడా విద్యాసాగర్ నటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హీరోగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఆయనకు అనూహ్యంగా పక్షవాతం వచ్చింది. దీంతో ఒక కాలు ఒక చేయి పనిచేయకుండా పోవడంతో ఆయన వీల్ చెయిర్ కే  పరిమితం కావాల్సి వచ్చింది. అయితే అలా వీల్ చెయిర్ కు పరిమితమైన సరే ఆయన వీల్ చైర్ లో కూర్చుని పలు సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించారు. అయితే విద్యాసాగర్ ఎలా మరణించారనే విషయం మీద క్లారిటీ లేదు కానీ ఆయన మరణించారు అనే విషయాన్ని సినీ నటుడు జోష్ రవి తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.


ఆయన ఒక మంచి నటుడు అని చెబుతూనే ఆయనకు రెస్ట్ ఇన్ పీస్ అంటూ కామెంట్ చేయడంతో పలువురు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. నటుడు జెమినీ సురేష్ సహా పలువురు నెటిజన్లు సైతం ఆయనకు నివాళులు అర్పిస్తూ పోస్టులు పెడుతున్నారు. విద్యాసాగర్ తన కెరియర్ లో ఎక్కువ సినిమాలు దర్శకుడు జంధ్యాలతోనే చేసినట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో చాలా రోజుల నుంచి ఆయన బాధపడుతున్నారని అంటున్నారు.



పక్షవాతం రావడంతో చాలా కాలం నుంచి మంచానికే పరిమితమయ్యారని తెలుస్తోంది. ఇక ఈ ఉదయం కాలేయ సంబంధిత వ్యాధితో దర్శకుడు బాబి తండ్రి కొల్లి మోహన్ రావు తన 69 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు రేపు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: Liger 3 Days Collections: తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా వసూళ్లు.. హిందీలో రౌడీ జోరు!


Also Read: Tragedy at Director Bobby Home: డైరెక్టర్ బాబీ ఇంట తీవ్ర విషాదం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి