Liger 3 Days Collections: తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా వసూళ్లు.. హిందీలో రౌడీ జోరు!

Vijay Devarakonda Liger 3 Days Total World Wide Collections: విజయ్ దేవరకొండ లైగర్ సినిమా మూడు రోజుల్లో ఎన్ని కలెక్షన్స్ రాబట్టిందో చూద్దాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 28, 2022, 02:15 PM IST
 Liger 3 Days Collections: తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా వసూళ్లు.. హిందీలో రౌడీ జోరు!

Vijay Devarakonda Liger 3 Days Total World Wide Collections: విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రూపొందిన లైగర్ సినిమా ఆగస్టు 25వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తెలుగులోనే కాకుండా ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో కన్నడ, మలయాళ, హిందీ, తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆట నుంచే నెగటివ్ టాక్ సంపాదించింది.

అయినా సరే మొదటి రోజు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్ల 57 లక్షల వసూళ్లు సాధించిన ఈ సినిమా రెండో రోజు కోటి 54 లక్షల వసూలు సాధించింది. ఇక మూడో రోజు శనివారం నాడు మాత్రం రెండో రోజు కంటే 40 శాతం కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది. మూడో రోజు మొత్తం మీద కోటి రూపాయలు మాత్రమే కలెక్షన్స్ సాధించిన సినిమా ఆంధ్ర తెలంగాణలో కలిసి 12 కోట్ల 11 లక్షల వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా కర్ణాటక సహా మిగతా భారతదేశంలో తెలుగు వెర్షన్ కు గాను కోటి పది లక్షల వసూలు సాధించింది.

అలాగే ఇతర భాషలలో 40 లక్షల వసూలు సాధించింది. నార్త్ ఇండియాలో నాలుగు కోట్ల 60 లక్షల షేర్ సాధించిన ఈ సినిమా ఓవర్సీస్ లో మూడు కోట్ల ఐదు లక్షల వసూళ్లు సాధించింది. టోటల్గా 88 కోట్ల నలభై లక్షల బిజినెస్ జరుపుకున్న ఈ సినిమాకు బ్రేక్ ఈవెంట్ టార్గెట్ గా 90 కోట్లుగా నిర్ణయించారు. ఇక మొదటి మూడు రోజుల్లో 21కోట్ల 26 లక్షల వసూళ్లు సాధించిన నేపథ్యంలో మరో 68 కోట్ల 74 లక్షలు వసూళ్లు సాధిస్తే కానీ హిట్ స్టేటస్ అందుకోవడం కష్టమే. ఇక హిందీలో ఈ సినిమా ఊహించని వసూళ్లు రాబడుతోంది. నిజానికి హిందీలో కలెక్షన్స్ ను నెట్ గా లెక్కిస్తారు. అలా రెండో రోజు 4.25 కోట్ల నెట్ వసూళ్లతో 10 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా 4.60 కోట్ల షేర్ రాబట్టింది. 

Also Read: Tragedy at Director Bobby Home: డైరెక్టర్ బాబీ ఇంట తీవ్ర విషాదం

Also Read: Suresh Babu Sold Theatre: ప్రైం సెంటర్లో థియేటర్ అమ్మేసిన సురేష్ బాబు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News