టాలీవుడ్ లో ( Tollywood ) మరో గోల్డెన్ ఎలా నడుస్తోంది. ఒక వైపు తెలుగు హీరోలు వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలకు అంగీకారం తెలుపుతున్నారు. మరో వైపు భారీ కాంబినేషన్లలో సినిమాలు తెరకెక్కుతున్నాయి. రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి ప్రభాస్ ను ప్యాన్ ఇండియా హీరోగా నిలబెట్టింది. నేడు ప్రభాస్, విజయదేవరకొండ, అల్లు అర్జున్ వంటి అనేక మంది తారలను దేశం మొత్తం గుర్తుపడుతోంది. ఇదే క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికిమ దక్షిణాది హీరోలు, దర్శకనిర్మాతలు ప్యాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Sachin Tendulkar: సెహ్వాగ్ కోసం సచిన్ త్యాగం


ప్రభాస్ జోరు...


బాహుబలి తరువాత ప్రభాస్ (Prabhas ) చేసిన మరో ప్యాన్ ఇండియా మూవీ సాహో. ఈ మూవీ తరువాత ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ చేస్తున్నాడు. ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది. రాధేశ్యామ్ చేస్తున్న సమయంలో ప్రభాస్ మరికొన్ని సినిమాలకు అంగీకరించాడు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకుడిగా భారీ బడ్జెట్ తో సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పాదుకోణె కథానాయికగా నటించనుంది. 


మరోవైపు టీ సిరీస్ తో ఆదిపురుష్ (Adipurush ) చేయడానికి అంగీకరించగా.. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. రావణుడు పాత్ర కోసం సైఫ్ అలీ ఖాన్ ను ఫిక్స్ చేశారు. మరో వైపు కేజీఎఫ్ ( KGF ) దర్శకుడితో కూడా ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ప్రభాస్ మాత్రం ప్యాన్ ఇండియా మూవీస్ తో బాగా బిజీగా ఉన్నాడు.


Also Read: Rajinikanth to PSPK:  మీ ఫేవరిట్ హీరోల అసలు పేర్లేంటో తెలుసా ?


త్రిపుల్ ఆర్ పై ఆశలు..


మరో వైపు రాజమౌళి  తెరకెక్కించే #RRRమూవీపై కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి.  జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ముఖ్యపాత్రల్లో తెరకెక్కుతోన్న ఈ మూవీ దేశ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీతో రామ్ చరణ్, తారక్ ఇద్దరికీ ప్యాన్ ఇండియా మార్కెట్ టచ్ చేసే అవకాశం దొరుకుతుంది. అయితే రామ్ చరణ్ ఇప్పటికే జంజీర్ అనే హిందీ మూవీ చేసినా అది ఆశించినంతగా ఆడలేదు. RRRతో  రామ్ చరణ్ కు ఆ అవకాశం ఉంది. ఇక తారక్ కూడా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్యాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేస్తున్నాడు. 


మరో వైపు అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ఫ సినిమా కూడా దేశ వ్యాప్తంగా విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. బన్నీకి నార్త్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అల్లు అర్జున్ (Allu Arjun ) సినిమాలు డబ్బింగ్ వర్షన్ లో యూపీ, హరియాణా, బీహార్,  పంజాబ్ లాంటి స్టేట్స్ లో ఎక్కువగా చూస్తుంటారు. 



Also Read: Video: మాస్కు వేసుకోవడం మనం చేసే సాధారణ తప్పులపై WHO వీడియో 


బన్నీకి ఇప్పటికే మార్కెట్ సెట్ అయిందిగా...


కేరళలో అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇవన్నీ బన్నీని ఇప్పటికే ప్యాన్ ఇండియా మూవీస్ కు ఎలిజిబుల్ చేసేశాయి. మరి పుష్ఫ సినిమా విడుదలయ్యాక రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.


తెలుగు సినీపరిశ్రమ ట్యాలెంట్ , సత్తా యావత్ భారతదేశంలో కనిపించడం అనేది అద్భుమైన ఫీలింగ్. తెలుగు వాళ్లు గర్వించదగ్గ విషయం. ఇలాగే మన స్టార్స్, దర్శకనిర్మాతలు వరుస విజయాలతో దూసుకెళ్లాలని కోరుకుందాం.


Also Read: Shraddha Kapoor: ప్రభాస్ ఛాలెంజ్ పూర్తి చేసిన సాహో హీరోయిన్


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR