Mahesh Babu:మహేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ.. పవన్ ఎమోషనల్ నోట్!
Heros Birthday Wishes to Mahesh Babu: మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. హీరోలు, సినీ సెలబ్రిటీలు మొదలు సాధారణ ప్రజలు కూడా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Heros Birthday Wishes to Mahesh Babu: సూపర్ సార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా హీరోలు, సినీ సెలబ్రిటీలు మొదలు సాధారణ ప్రజలు కూడా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మహేష్ బాబు కేవలం హీరోగా నటించడమే కాకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడంతో ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పలువురు అయితే మహేష్ బాబు ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి వారికి కొత్త జీవితాలు ప్రసాదించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ చాలా మంది ఆయనను ఆరోగ్య ప్రదాతగా అభివర్ణిస్తున్నారు.
ఇక మహేష్ బాబుకు చాలా మంది హీరోలు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబుకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ‘’ఎందరో చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేష్ బాబు. ఆ భగవంతుడు అతనికి మరింత శక్తి ని,సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ’’ చిరంజీవి విషెస్ చెప్పారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు చెబుతూ ఒక లేఖ రాశారు. తనదైన శైలి నటనతో నవతరం ప్రేక్షకులను మెప్పిస్తున్న మహేష్ చేపట్టే సేవా కార్యక్రమాలు… హృద్రోగంతో బాధపడే చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేయించడం అభినందనీయమని ఈ సంధర్భంగా పవన్ పేర్కొన్నారు.
కృష్ణ గారి నట వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ.. తండ్రి బాటలోనే దర్శకులకు, నిర్మాతలకు అండగా నిలుస్తున్నారని, ‘అర్జున్’ సినిమా సందర్భంలో పైరసీపై పోరాటానికి మహేష్ బాబు గళం వినిపిస్తే ఆయనకు మద్దతుగా నిలిచానని పవన్ గుర్తు చేశారు. పరిశ్రమను కాపాడుకొనేందుకు ఆయన ముందుకు రావడంతో అందరం వెన్నంటి నిలిచామని, ఇక ‘జల్సా’ సినిమాలో సంజయ్ సాహూ పాత్రను పరిచయం చేసేందుకు మహేష్ బాబు నేపథ్య గాత్రం అయితే బాగుంటుందని, దర్శకులు త్రివిక్రమ్ కోరగానే అంగీకరించిన సహృదయత మహేష్ బాబు గారిదని గుర్తుచేస్తుకున్నారు. హీరోగా తనదైన పంథాలో వెళ్తూ ప్రేక్షకుల మెప్పు, పురస్కారాలూ అందుకుంటున్న మహేష్ బాబు మరిన్ని విజయాలు అందుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని పవన్ అన్నారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా హాపీ బర్త్ డే మహేష్ అన్న, మీరు ఎల్లప్పుడూ విజయదరహాసాలతో ఉండాలని పేర్కొన్నారు. వెంకటేష్ ‘’పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రియమైన మహేష్. చిన్నోడా ఈ సంవత్సరం నీకు అద్భుతంగ ఉండాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. రవితేజ ‘’ప్రియమైన స్నేహితుడు, గొప్ప వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు, మహేష్. మీకు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, ఆనందం సహా విజయాలు మీకు అందాలని కోరుకుంటున్నాను'' అని పేర్కొన్నారు.
Also Read: Taapsee Pannu: ఫోటోగ్రాఫర్లతో తాప్సీ పన్ను గొడవ.. చివర్లో ఎవరూ ఊహించని పని.. వీడియో వైరల్!
Also Read: Pradeep Patwardhan: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు ప్రదీప్ హఠాన్మరణం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook