Tollywood Icon Star Allu Arjuns Pushpa movie second single song is out: ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ( Allu Arjun) ఫ్యాన్స్ కు పండుగ ముందే వచ్చేసింది. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ (Pushpa) మూవీ నుంచి మరో కొత్త పాట రిలీజ్‌ అయ్యింది. ‘చూపే బంగారమాయెనే  శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయెనే’ సాంగ్‌ వచ్చేసింది. యూట్యూబ్‌లో ఈ పాటను అప్‌లోడ్ చేసిన కొద్ది సేపటికే భారీగా వ్యూస్ వచ్చాయి. సోషల్‌మీడియాలోనూ ఇప్పుడు ఈ పాట వైరల్‌ అవుతోంది. ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్‌ (Devi Sri Prasad) మ్యూజిక్‌ అందించగా సిధ్ శ్రీరామ్‌ (Sid Sriram) పాడారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : APPSC Notification Released: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ


ఇక పాన్‌ ఇండియా చిత్రంగా పుష్ప మూవీ తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సుకుమార్ (Sukumar). ఈ మూవీని రెండు పార్ట్స్‌గా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మూవీలో బన్నీ(Bunny) ఎర్రచందనం స్మగ్లర్‌గా చాలామాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం మొదటిసారి రష్మిక (Rashmika) బన్నీతో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు. ఇందులో ఆమె శ్రీవల్లి (Srivalli) పాత్రలో పుష్పరాజ్‌ (PushpaRaj) ప్రేయసిగా అలరించనున్నారు. మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై పుష్ప నిర్మితమవుతోంది. పుష్ప (Pushpa) మూవీ డిసెంబర్ 17న రిలీజ్‌ కానుంది.



 


Also Read : Bigg Boss 5: 25 నిమిషాలకే షాకింగ్‌ రెమ్యునరేషన్‌ అందుకున్న జబర్దస్త్ కమెడియన్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook