Kia EV6 Electric Crossover Price: టాలీవుడ్ కింగ్ నాగార్జున కొత్త కారు కొన్నాడు. దేశంలోని అత్యుత్తమ ఎలక్ట్రిక్ వాహనాలలో ఒకటైన సరికొత్త కియా ఈవీ6 కారును నాగ్ కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను డీలర్‌షిప్ ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. నాగార్జున, తన భార్య అమల అక్కినేనితో కలిసి కొత్త కియా ఈవీ 6 డెలివరీ తీసుకుంటున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వైట్ కలర్‌ కారును అమలతో కలిసి నాగ్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ కారు ధర ఎంత ఉంటుందని నెట్టింట చర్చ మొదలైంది. కారు విషయానికి వస్తే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కియా మన దేశంలో తన మొట్టమొదటి, ఏకైక ఎలక్ట్రిక్ కారుగా సరికొత్త ఈవీ6ను పరిచయం చేసింది. భారత్‌లో 100 కార్లను విక్రయించాలని కియా లక్ష్యంగా పెట్టుకోగా.. మొదటి రోజే 355 కంటే ఎక్కువ బుకింగ్‌లతో భారీ స్పందన వచ్చింది. కియా EV6 ఆకర్షణీయమైన డిజైన్‌ ఉండడంతో ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. ఇందులోని ఏరోడైనమిక్ సిల్హౌట్ రోడ్డుపై అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఫ్రంట్ ఫాసియా విలక్షణమైన టైగర్-నోస్ గ్రిల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈవీ6 స్లిమ్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌లతో అనుసంధించారు. ఫ్రేమ్‌లెస్ విండోస్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ దాని స్ట్రీమ్‌లైన్డ్ లుక్‌ అదిరిపోయింది. బ్యాక్‌సైడ్ బోల్డ్ ఫుల్ వెడల్పు ఎల్‌ఈడీ లైట్ బార్ కారు వెడల్పులో విస్తరించి.. మోడరన్ లుక్‌లో కనిపిస్తుంది. 


ఈవీ6 లోపల కూడా.. చాలా వెడల్పుగా ఉంటుంది. బ్లాక్ స్వెడ్ సీట్స్, వేగన్ లెదర్ యాక్సెంట్‌లతో ఆల్-బ్లాక్ డిజైన్‌తో ఉంది. వైర్‌లెస్ ఛార్జర్, డిఫరెంట్ డ్రైవ్ మోడ్‌లు, స్మార్ట్ కీ, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, మెమరీ ఫంక్షన్‌తో 10-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీటుతో వస్తుంది. రిజనరేటివ్ బ్రేకింగ్, కనెక్టెడ్ కారు క్యాపబులిటీస్, ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, అడాప్టివ్ డ్రైవింగ్ బీమ్‌తో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, డ్యూయల్ 12.3-అంగుళాల కర్వ్డ్ స్క్రీన్‌లు, షిఫ్ట్ బై వైర్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌ల కోసం ప్యాడిల్ షిఫ్టర్‌లు ఉన్నాయి.


77.4 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో 528 కిలోమీటర్లు డ్రైవింగ్ లిమిట్ ఉంటుంది. బ్యాటరీ అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది కేవలం 4.5 నిమిషాల్లో 100 కిలోమీటర్ల వరకు ఛార్జింగ్ అవుతుంది. 350 kW ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి 18 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. అయితే 50 kW ఛార్జర్‌కు దాదాపు 73 నిమిషాలు పడుతుంది. RWD సింగిల్ మోటార్ యూనిట్ 350 Nm, 225 Bhp పవర్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. 0 నుంచి 100 స్పీడ్ అందుకోవడానికి కేవలం 3.5 సెకన్లు మాత్రమే పడుతుంది. ఈవీ 6 ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.60.95 లక్షలుగా ఉంది.


టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా వద్ద కూడా ఈ కారు ఉంది. ఈవీ 6 శాటిన్ సిల్వర్ షేడ్‌లో కొనుగోలు చేశాడు. గతంలో రుతురాజ్ గైక్వాడ్, కేదార్ జాదవ్‌లతో కలిసి తన ఈవీ6ని నడుపుతూ కనిపించాడు. మలయాళ స్టార్ నటుడు మోహన్‌లాల్ కూడా సరికొత్త కియా ఈవీ6 వాహనాన్ని కొనుగోలు చేశాడు.  


Also Read: Ambati Rayudu News: రాజకీయ రంగ ప్రవేశంపై అంబటి రాయుడు కీలక ప్రకటన  


Also Read: Singer Sai Chand: తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన ప్రముఖ సింగర్ కన్నుమూత  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి