OTT This Week: ఈగల్, అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్ ఓటీటీల్లో వచ్చేశాయి
OTT This Week: ఓటీటీ ప్రేమికులకు శుభవార్త. అప్పుడే కొత్త కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. కొత్త సినిమాలు కూడా ఉండటంతో ఓటీటీ ప్రేమికుల్ని రంజింపచేస్తున్నాయి. ఇటీవల ఓటీటీలో విడుదలైన కొత్త సినిమాలేంటో తెలుసుకుందాం.
OTT This Week: ఇటీవలి కాలంలో ఓటీటీలకు క్రేజ్ బాగా పెరిగింది. అన్ని రకాల కంటెంట్ కావల్సిన భాషలో, నచ్చిన సమయంలో ఇంట్లో కూర్చుని లేదా బయట తిరుగుతూ చూసే అవకాశముండటంతో ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. అందుకే ప్రతి సినిమా థియేటర్ రిలీజ్‌తోపాటు ఓటీటీ రిలీజ్ డేట్ ఉంటోంది. దీనికితోడు కొత్త వెబ్‌సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఒక్కోసారి కొత్త కొత్త సినిమాలు చడీచప్పుడు లేకుండా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతుంటాయి. అదే విధంగా మూడు కొత్త సినిమాలు ఓటీటీల్లో వచ్చేశాయి. రవితేజ నటించిన ఈగల్ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో మార్చ్ 1 నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఈటీవీ విన్‌లో కూడా వస్తోంది. ఫిబ్రవరి 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆశించిన మేర కలెక్షన్లు సాధించలేకపోయింది. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించి ఈ సినిమాలో కావ్య థాఫర్, అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, అజయ్ ఘోష్ కీలకపాత్రల్లో కన్పిస్తారు.
మరోవైపు దష్యంత్ కటికనేని తెరకెక్కించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా మార్చ్ 1 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. సుహాస్, శివానీ నగారం ప్రధాన పాత్రలో కన్పిస్తారు. ఫిబ్రవరి మొదటి వారంలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కామెడీ టాక్ తెచ్చుకుంది. శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చాడు.
ఇక ఆహాలో ఫిబ్రవరి 26 నుంచి మరో స్మాల్ బడ్జెట్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. బిగ్‌బాస్ ఫేమ్ సయ్యద్ సొహైల్ నటించిన బూట్‌కట్ బాలరాజు సినిమా విలేజ్ బ్యాక్‌డ్రాప్ లవ్ స్టోరీ. ఫిబ్రవరి 2న ధియేటర్లలో విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. సొహైల్‌కు మరో బిగ్ ఫెయిల్యూర్ అని చెప్పవచ్చు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీ ట్రాక్ హాస్యాన్ని పండించలేకపోయింది.
ఇక ఫిబ్రవరి 27 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో గేమ్ ఆన్ తెలుగు సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. గీతానంద్, నేహా సోలంకి నటించిన ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్. ఇది కూడా ఫిబ్రవరి 2న ధియేటర్లలో విడుదలైంది. పెద్దగా ఆకట్టుకోకపోవడంతో నెలతిరక్కుండానే ఓటీటీలో వచ్చేసింది. రియల్ టైమ్ గేమ్స్ చుట్టూ సినిమా కధ నడుస్తుంది.
ఇది కాకుండా షీనా బోరా హత్యకేసుపై రూపొందిన ది ఇంద్రాణి ముఖర్జియా వెబ్‌సిరీస్ ఫిబ్రవరి 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతోపాటు తెలుగు, తమిళం, ఇంగ్లీషు భాషల్లో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్‌సిరీస్ టాప్ 5లో ఉంది. ఆకట్టుకునే కథనం, అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో సాగుతుంది.
Also read: BSNL Plans: 100 ఎంబీపీఎస్ స్పీడ్, ఉచిత ఓటీటీ సేవలు, అన్‌లిమిటెడ్ కాల్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook