Tollywood: చిరంజీవి, కమల్ హాసన్ మధ్య తేడాలు చెప్పేసిన కే విశ్వనాథ్
Tollywood: కళాతపస్వి కే విశ్వనాథ్ మరణంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్దిదిక్కు కోల్పోయింది. కమల్ హాసన్, చిరంజీవిలతో ప్రత్యేక అనుబంధం కలిగిన ఆ దర్శక యశస్వి..ఇద్దరి తేడా గురించి ఏం చేప్పారో తెలుసా..
టాలీవుడ్ మేటి దర్శకుడు, నటుడు కే విశ్వనాథ్ 93 ఏళ్ల వయస్సులో తుదిశ్వాస విడిచారు. కమల్ హాసన్, చిరంజీవిలో ఉన్న తేడాల గురించి ఆయన చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు మీ కోసం..
దర్శకుడు కే విశ్వనాథ్ మరణవార్త అందర్నీ దిగ్భ్రాంతి పరుస్తోంది. సినీ జీవితంలో ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన ఎందరో నటీ నటుల్ని, సంగీతకారుల్ని, గాయకుల్ని సినిమా తెరకు పరిచయం చేశారు. కొందరికి కే విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సినిమాలే ఇంటిపేరుగా మారాయి. గత కొద్దికాలంలో అనారోగ్యంతో బాధపడుతున్న కే విశ్వనాథ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఆయన జీవితంలో శంకరాభారణం, సిరి సిరి మువ్వ, స్వాతిముత్యం, ఆపద్భాంధవుడు, స్వర్ణకమలం, సాగర సంగమం వంటి మెగా హిట్ సినిమాలు చాలానే ఉన్నాయి. కే విశ్వనాథ్ సినిమాలంటే..భారతీయత, తెలుగుదనం కొట్టొచ్చినట్టు కన్పిస్తాయి. ఈ కళాతపస్వికి ప్రముఖ నటులు కమల్ హాసన్, చిరంజీవిలతో విడదీయరాని సంబంధముంది. అందుకే ఆ ఇద్దరి గురించి తరచూ ఆసక్తికర విషయాలు వెల్లడిస్తూ ఆందర్నీ ఆశ్చర్చపరుస్తుంటారు. కమల్ హాసన్‌లో చాలా చెడు లక్షణాలున్నాయని ఓ సందర్భంలో చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
కమల్ హాసన్ విశ్వరూపం గురించి మీకెవ్వరికీ తెలియదని..అతనిలో చాలా చెడు లక్షణాలున్నాయంటూ ఓ సందర్భంలో మొదలుపెట్టారు. అతడిలోని మొదటి చెడు లక్షణం సినిమా గురించి అపారమైన నాలెడ్జ్ కలిగి ఉండటమేనన్నారు. రెండవది. దర్శకత్వంలో, నటనలో అతనికి తెలియనిదేదీ లేదు..ఇది మంచిది కాదంటూ అందర్నీ నవ్వించేశారు. తనను దర్శకుడిగా ఓ అవతారమే చేశారని..నటుడిగా రెండవ అవతారమెత్తాలని బలవంతం చేసింది కమల్ హాసనే అని కే విశ్వనాథ్ గుర్తు చేసుకున్న సందర్భముంది.
చిరంజీవి, కమల్ హాసన్‌లో తేడా
ఇక కమల్ హాసన్, చిరంజీవి ఇద్దరూ ఆయనకు కావల్సినవారే. అలాంటి ఆ ఇద్దరిలో తేడా గురించి ప్రశ్నించినప్పుడు ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. ఇద్దరి మధ్య వ్యత్యాసాల్ని తాను గమనించనని చెప్పారు. అంతేకాకుండా..కమల్ హాసన్‌తో సినిమా తీస్తున్నప్పుడు ఎలాంటి నటన రాబట్టాలనే విషయాన్ని, చిరంజీవితో చేస్తుంటే ఆ కథకు తగ్గట్టు ఎలా నటింపచేయాలని ఆలోచిస్తానన్నారు చిరంజీవి.
Also read: K Viswanath: కళాతపస్వి కే విశ్వనాధ్ కెరీర్‌లో శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం అన్నీ విజయాలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook