Tollywood: తెలంగాణకు బై బై! సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్లనుందా?
Tollywood Likely Moves To Andhra Pradesh: తెలంగాణ ఉద్యమ సమయంలో లేని ఇబ్బందికర పరిస్థితులు ఇప్పుడు తెలంగాణలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటోంది. ప్రభుత్వం నేరుగా దాడి చేస్తుండడంతో సినీ పరిశ్రమ ఏపీకి తరలిపోవాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
Tollywood U Turn: తెలుగు సినీ పరిశ్రమ ఒక్క తెలుగు భాషకే పరిమితం కాలేదు.. దక్షిణాదితోపాటు బాలీవుడ్‌ను ఇప్పుడు పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగింది. అలాంటి సినీ పరిశ్రమ తెలంగాణ కేంద్రంగా.. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతోంది. కానీ కొన్నాళ్లుగా తెలుగు సినీ పరిశ్రమకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇక్కడి ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అనే స్థాయిలో వివాదం కొనసాగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఇలాంటి పరిస్థితులు లేవు. కానీ ఇప్పుడు ఏర్పడిన పరిస్థితుల కారణంగా సినీ పరిశ్రమ మరో చోటకు మకాం మారాలని చూస్తున్నట్లు సమాచారం. దీనికి ఏపీ రాజకీయ నాయకులు మాట్లాడుతున్న వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
Also Read: KT Rama Rao: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. రేవంత్ రెడ్డిని ఎర్రగడ్డకి తీసుకెళ్లాలని విజ్ఞప్తి
టాలీవుడ్ అంటే ఒక్క కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులే కాదు ఇప్పుడు ప్రపంచం మొత్తం. మన తెలుగు సినిమాల కోసం హలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. అంతటి ఘన కీర్తి పొందుతున్న తెలుగు ఇండస్ట్రీ తెలంగాణ నేలపై ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నాడు ఒక ప్రాంతానికే సినీ పరిశ్రమ మద్దతు పలుకుతుందనే కారణంతో నాడు సినీ పరిశ్రమపై దాడులు జరిగాయి. కొన్ని సినిమాల విడుదలను అడ్డుకున్నారు. కానీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో ఇండస్ట్రీకి పరిస్థితులు పూర్తి అనుకూలంగా మారాయి. ఒక విధంగా చెప్పాలంటే సినీ పరిశ్రమ హైదరాబాద్‌లో సుస్థిర స్థానం ఏర్పడేలా పరిణామాలు జరిగాయి. ప్రభుత్వ ప్రోత్సాహాకర విధానాలతో ఇండస్ట్రీ మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంది. ఒక్క నంది అవార్డుల అంశం పక్కనపెడితే తెలంగాణలో సినీ పరిశ్రమకు స్వర్ణ యుగం వచ్చింది.
Also Read: Snakes Attack Video: పాముల దండయాత్ర.. చిక్కినట్టే చిక్కి తుర్రుమన్న 'తొండ'
కానీ పదేళ్ల తర్వాత మళ్లీ పరిస్థితులు మారాయి. ఒకవిధంగా చెప్పాలంటే దారుణంగా మారాయి. దురుద్దేశపూర్వకంగా వేధింపులకు గురి చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.. సమంత నాగచైతన్య విడాకులు.. దేవర ప్రి రిలీజ్ ఈవెంట్.. తాజాగా అల్లు అర్జున్ వ్యవహారం. అంతకుముందు డ్రగ్స్ వ్యవహారం.. గద్దర్ అవార్డుల అంశంలో ప్రభుత్వం సినీ పరిశ్రమపై ఒక విధంగా దాడి చేసింది. దీనికితోడు మంత్రిగా ఒకరు బాధ్యతలు స్వీకరిస్తే అభినందించలేదని.. ఒకరి జన్మదినం అయితే విష్ చేయలేదని పరిశ్రమపై కొందరు తీవ్ర మాటల దాడి చేశారు. ఇలా వరుస పరిణామాలు సినీ పరిశ్రమపై కక్ష కట్టినట్టు తయారైంది. ఈ పరిణామాల నేపథ్యంలో సినీ పరిశ్రమ సందిగ్ధంలో పడింది.
గతంలో ఎన్నడూ ప్రభుత్వం ఇలా సినీ పరిశ్రమపై దాడి చేయలేదు. పొమ్మనలేక పొగబెట్టినట్టు సినీ పరిశ్రమపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి సినీ పరిశ్రమకు పిలుపు వస్తోంది. 'ఏపీకి రండి' అని సినీ పరిశ్రమను అక్కడి ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్‌తో సహాయ మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఆహ్వానిస్తున్నారు. ప్రోత్సాహాకాలు, రాయితీలు.. అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇస్తుండడంతో కొందరు సినీ పెద్దలు అక్కడికి వెళ్లేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. మరి చూడాలి ఈ పరిణామాలు ఎక్కడకు దారి తీస్తాయో.. లేదంటే తెలంగాణ ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చి సుహృద్భావ వాతావరణం కల్పిస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతానికైతే తెలంగాణలో సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం వాస్తవమే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.