Lover Boy Tarun: మళ్లీ తెరంగేట్రం చేయనున్న లవర్ బాయ్ తరుణ్
Lover Boy Tarun: తల్లిదండ్రుల్నించి నటనను వారసత్వంగా తీసుకుని సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన బాలనటుడు, హీరో తరుణ్. చాలాకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న ఈ లవర్‌బాయ్ మళ్లీ తెరంగేట్రం చేయనున్నాడు.
Lover Boy Tarun: తల్లిదండ్రుల్నించి నటనను వారసత్వంగా తీసుకుని సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన బాలనటుడు, హీరో తరుణ్. చాలాకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న ఈ లవర్‌బాయ్ మళ్లీ తెరంగేట్రం చేయనున్నాడు.
రోజారమణి, చక్రపాణి అలనాటి నటుల తనయుడు తరుణ్(Tarun). సినీ పరిశ్రమపై మక్కువతో బాలనటుడిగా రంగప్రవేశం చేసి..యుక్తవయస్సు రాగానే హీరోగా మారి హిట్ మూవీస్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఓ సమయంలో మంచి బిజీ నటుడిగా ఉన్నాడు. 2000 సంవత్సరంలో హీరోగా అడుగుపెట్టిన తొలి సినిమా నువ్వే కావాలితో సంచలనం రేపాడు. ఈ సినిమా అప్పట్లో తెలుగు సినిమా పరిశ్రమ(Tollywood)లో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే వంటి సూపర్ హిట్స్‌తో క్రేజ్ సంపాదించుకున్నాడు. తరుణ్ కెరీర్ అంతా ఎక్కువగా ప్రేమ కథా సినిమాలే ఉండటంతో లవర్ బాయ్‌గా పేరు పొందాడు. చివరిసారిగా 2017లో ఇది నా లవ్ స్టోరీ సినిమా చేసి..సినిమాలకు దూరంగా ఉన్నాడు. నాలుగేళ్ల విరామం అనంతరం ఇప్పుడు మళ్లీ సినిమాలో ఎంట్రీకు సిద్ధమవుతున్నాడు. తరుణ్ స్నేహితుడు రాసిన కధతో సినిమాకు సిద్ధపడుతున్నాడు. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగా సినిమా కధ ఉండబోతోంది.
తల్లిదండ్రుల్నించి నటనను వారసత్వంగా పొందిన తరుణ్..బాల్యంలోనే తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నటించాడు. ప్రస్తుతం కొత్త సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
Also read: AR Rahman: రచయితగా, నిర్మాతగా మారుతున్న ఏఆర్ రెహమాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook