Sirivennela Songs: సిరివెన్నెల నేపధ్యమేంటి, రాసిన పాటలేంటి
Sirivennela: ప్రముఖ సినీ గేయ రచయిన సిరివెన్నెల సీతారామశాస్త్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. సినీ పరిశ్రమను విషాదంలో ముంచేశారు. సిరివెన్నెల నేపధ్యమేంటి..రాసిన ప్రముఖ పాటలేంటో పరిశీలిద్దాం.
Sirivennela: ప్రముఖ సినీ గేయ రచయిన సిరివెన్నెల సీతారామశాస్త్రి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. సినీ పరిశ్రమను విషాదంలో ముంచేశారు. సిరివెన్నెల నేపధ్యమేంటి..రాసిన ప్రముఖ పాటలేంటో పరిశీలిద్దాం.
సిరివెన్నెల సీతారామశాస్త్రి(Sirivennela Sitaramasastri) ఇకలేరనే వార్తను సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స సందర్భంగా కన్నుమూశారు. తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్రవేసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇంటి పేరులో ఉన్న సిరివెన్నెల ఆయన తొలి సినిమా. తొలి సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్న ప్రముఖ గేయ రచయిత. ఈ నేపధ్యంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి నేపధ్యం గురించి..ఆయన రాసిన ప్రముఖ పాటల గురించి తెలుసుకుందాం.
తెలుగు సినీ పాటల రచయితగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి అసలు పేరు చేంబోలు సీతారామశాస్త్రి. కాకినాడలో ఇంటర్మీడియట్ విద్య పూర్తి చేసిన సిరివెన్నెల..ఆంధ్ర యూనివర్శిటీ నుంచి బీఏ పూర్తి చేసి..ఆ తరువాత ఎంఏ చేశారు. ఎంఏ చేస్తుండగా ప్రముఖ దర్శకుడు కే విశ్వనాథ్ సిరివెన్నెల సినిమాతో పాటల రచయితగా సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు ఆ తరువాత ఇక వెనుదిరిగి చూడలేదు.1986లో ఈ సినిమా విడుదలైంది. తొలి సినిమాకే ఉత్తమ గేయ రచయితగా అవార్డు అందుకున్నారు. 2019లో కేంద్ర ప్రభుత్వం (Central government)పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
విధాత తలపున ప్రభవించినది, చందమామ రావే, ఈ గాలీ..ఈ నేలా, చినుకు చినుకు అందెలతో, మెరిసే తారలదే రూపం, పారాహుషార్, తరలిరాద తనే వసంతం, రండి..రండి..రండి, నమ్మకు నమ్మకు ఈ రేయి, కో అంటే కోటీ, జాము రాతిరి జాబిలమ్మా, అమ్మాయి ముద్దు ఇవ్వందే, నిగ్గదీసి అడుగు, బిచ్చగత్తెకీ, భద్రం బీకేర్ ఫుల్ బ్రదరూ, చిలకా ఏ తోడు లేకా, గ్రీకువీరుడూ, కన్నుల్లో నీ రూపమే ఇలా చాలా పాటలు. రాసిన ప్రతిపాట ఆణిముత్యంగా నిలిచింది. ఎన్ని హిట్ సాంగ్స్ అనేది నిర్ణయించడం కష్టసాధ్యమే. రాసిన ప్రతిపాట మనసు కదిలించేదే. ప్రతి పాట మనస్సుల్ని హత్తుకున్నవే. అందుకే సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.
Also read: Sirivennela Sitaramasastri: ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల ఇకలేరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook