Tollywood Movies Got Good Collections on Independence Day: టాలీవుడ్ ఒకే నెలలో మూడు సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులకు అందించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముందుగా విడుదలైన కళ్యాణ్ రామ్ బింబిసార, దుల్కర్ సల్మాన్ సీతారామం సినిమాలు రెండు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఒకేరోజు విడుదలైన ఈ సినిమాలకు మొదటి రోజు నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. అలాగే నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన కార్తికేయ 2 సినిమా కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఆగస్టు 15 సందర్భంగా సెలవు కావడంతో ఈ సినిమాలకు మంచి వసూళ్లు లభించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బింబిసార సినిమా విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో 11వ రోజు కోటి 52 లక్షల వసూళ్లు సాధించి మొత్తం 11 రోజులకు గాను 27 కోట్ల 56 లక్షల షేర్, 43 కోట్ల 32 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 11 రోజులకు కర్ణాటక సహా మిగతా ప్రాంతాలలో కోటి రూపాయల 95 లక్షలు, ఓవర్సీస్ లో రెండు కోట్ల పది లక్షల వసూలు సాధించి ప్రపంచవ్యాప్తంగా 31 కోట్ల 61 లక్షల షేర్, 52 కోట్ల పాతిక లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ సినిమా 15 కోట్ల 60 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకోవడంతో 16 కోట్ల 20 లక్షల బ్రేక్ ఈవెన్ గా నిర్ణయించారు.


ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేయడమే కాక 15 కోట్ల 41 లక్షల ప్రాఫిట్ తో డబల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక సీతారామం సినిమా విషయానికొస్తే ఈ సినిమా 11వ రోజు కోటి 26 లక్షల వసూళ్లు సాధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 14 కోట్ల 91 లక్షల వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా 11 రోజులకు గాను కర్ణాటక సహా మిగతా ప్రాంతాలలో కోటి 65 లక్షలు అలాగే మిగతా భాషలలో నాలుగు కోట్ల 65 లక్షలు వసూళ్లు సాధించడమే కాక ఓవర్సీస్ లో ఐదు కోట్ల 45 లక్షల వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 11 రోజులకు గాను 26 కోట్ల 60 లక్షల రూపాయల వసూళ్లు సాధించిన ఈ సినిమాకి మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ 16 కోట్ల 20 లక్షలకి జరిగింది.


దీంతో బ్రేక్ ఈవెంట్ టార్గెట్ గా 17 కోట్లు నిర్ణయించారు. ఇప్పటికే బ్రేక్ ఈవెంట్ టార్గెట్ పూర్తిచేసిన ఈ సినిమా 9 కోట్ల 60 లక్షల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక నితిన్ హీరోగా నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా నాలుగో రోజు సత్తా చాటింది. నాలుగో రోజు కోటి రూపాయల 20 లక్షలు సాధించి మొత్తం ఇప్పటివరకు నాలుగు రోజులకు ఎనిమిది కోట్ల 28 లక్షలు వసూలు చేసింది.


ఇక నాలుగు రోజులకు గాను కర్ణాటక సహా మిగతా భారత దేశంలో 40 లక్షలు ఓవర్సీస్ లో 37 లక్షలు వసూళ్లు సాధించి మొత్తం నాలుగు రోజులకు తొమ్మిది కోట్ల ఐదు లక్షల షేర్ వసూలు సాధించింది. ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ 21 కోట్ల 20 లక్షల రూపాయలు కావడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్లుగా నిర్ణయించారు. అంటే 12 కోట్ల 95 లక్షలు సాధిస్తేనే సినిమా హిట్ గా నిలిచే అవకాశం ఉంటుంది. ఇక కార్తికేయ సినిమా కూడా మూడో రోజు సత్తా చాటి మొదటి రెండు రోజుల కంటే ఎక్కువ వసూలు చేసింది. అంటే సినిమాకి స్వాతంత్ర దినోత్సవం కలిసి వచ్చిందన్న మాట.


Also Read: Kaushik LM: సినీ పరిశ్రమలో విషాదం.. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ తీవ్ర దిగ్భ్రాంతి


Also Read: Bandla Ganesh: పవన్ కళ్యాణ్ సినిమా లేనట్టే.. వింత ట్వీట్ తో కొత్త అనుమానాలు రేపిన బండ్ల!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి