Little krishna: ఈ ఫొటో ఎవరిదో గుర్తు పట్టారా? తెలుగోడు మీసం మెలేసేలా చేసిన డైరెక్టర్ ఈయన?
SS Rajamouli as Little Krishna: తెలుగు సినిమా సత్తాను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పాడు, ఈ మధ్యనే ఆస్కార్ కూడా అందుకునేలా చేసి తలెత్తుకునేలా చేశారు.. ఆయన ఎవరో తెలుసా?
SS Rajamouli as Little Krishna Pic: అవును నిజమే ఆయన ఇప్పుడు టాలీవుడ్ లోనే ఒక స్టార్ డైరెక్టర్. టాలీవుడ్ లోనే కాదు తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన డైరెక్టర్. ఈ ఒక్క పదం చాలేమో ఆయన ఎవరు? అని చెప్పడానికి. అవును మీరు గెస్ చేసింది కరెక్టే ఆయన మరెవరో కాదు శ్రీశైల శ్రీ రాజమౌళి. ఇంట్లో అందరూ ముద్దుగా నంది అని పిలుచుకునే ఆయన రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూ దర్శకత్వం మీద అవగాహన పెంచుకున్నారు.
ఆ తరువాత శాంతి నివాసం అనే సీరియల్ తో డైరెక్టర్ గా మారి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో సినిమా డైరెక్టర్ గా మారారు. ఎప్పుడైతే స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమా చేశారో ఆ తర్వాత రాజమౌళి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని పడలేదు. వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకుంటూ ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నారు. ఆ సినిమాకి ఒక ఆస్కార్ అవార్డు కూడా లభించడంతో ఆయనకు మరింత జోష్ లభించినట్లు అయింది.
ఆ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి ఎంఎం కీరవాణి అందించిన మ్యూజిక్ కి గాను బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు లభించింది. ఇక రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేయబోతున్నారు. కేఎల్ నారాయణ నిర్మాణంలో మహేష్ బాబు హీరోగా ఈ సినిమా రూపొందనుంది. ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం అవ్వలేదు కానీ త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని అంటున్నారు. ఇక ఈ ఫోటో విషయానికి వస్తే ఈ ఫోటోని ఆయన సోదరి ఎంఎం శ్రీలేఖ షేర్ చేశారు. ఆమె కూడా టాలీవుడ్ సినీ పరిశ్రమలో సంగీత దర్శకురాలిగా రాణిస్తున్నారు.
ఆమె తన ఫేస్బుక్ అకౌంట్ వేదికగా ఈ ఫోటోలు షేర్ చేసి ఎవరో చెప్పమని కోరితే ముఖ కవళికలు అన్నీ శ్రీలేఖ లాగానే ఉండడంతో అందరూ ఆమె పేరునే ప్రస్తావిస్తున్నారు. కానీ ఈ ఫోటో రాజమౌళిదని ఆమె వేరే కామెంట్ లో పేర్కొన్నారు. ఇక మరొక నెటిజన్ అయితే చిన్నప్పుడు రాజమౌళి శ్రీకృష్ణుడిగా ఎంఎం శ్రీలేఖ గోపికగా ఒక సినిమా ప్రారంభించారని అయితే ఆ సినిమా కొంత షూట్ జరిగిన తర్వాత నిలిపివేయబడిందని బహుశా ఆ సినిమాలోని ఫోటో అయి ఉండవచ్చు అని కామెంట్ చేశారు. ఈ అంశం మీద మీకు ఏమైనా అవగాహన ఉంటే కింద కామెంట్ చేయండి.
Also Read: Balagam Collections: బలగం 'బలం' ఇదీ.. ఓటీటీలో రిలీజయ్యాక కూడా థియేటర్లకు క్యూ కడుతున్న జనాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook