Shilpa Chowdary News: ఫైనాన్స్ పేరిట సినీ తారలను పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడిన శిల్పా చౌదరిపై మరో కేసు నమోదయ్యింది. హైదరాబాద్ లోని నార్సింగి పోలీస్ స్టేషన్ లో యంగ్ హీరో హర్ష ఆమెపై ఫిర్యాదు చేశాడు. ‘సెహరి’ చిత్రంలో హీరోగా నటించిన హర్ష.. శిల్పా చౌదరి తన వద్ద రూ.3 కోట్లు తీసుకొని తిరిగి చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే, ఈ ‘సెహరి’ చిత్రాన్ని శిల్ప నిర్మించినట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు ఆమె మోసాలు ₹10 కోట్లుగా తేలింది. అంతకముందు శిల్పా చౌదరిపై నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో ముగ్గురు మహిళలు ఫిర్యాదు చేయగా.. ₹7.05 కోట్లు తీసుకుందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.


జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్లలోనూ శిల్పా చౌదరిపై అనేక కేసులు నమోదయ్యాయి. కిట్టీ పార్టీల పేరుతో మహిళలను ఆకట్టుకున్న శిల్ప.. స్థిరాస్తి వ్యాపారం కోసం డబ్బు తీసుకొందని పోలీసులు గుర్తించారు. భారీగా లాభాలు ఇస్తామని నమ్మించి మోసం చేసిందని ఆమెపై ఫిర్యాదులు అందాయి. దీంతో తదుపరి విచారణకు 7 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు నిన్న ఉప్పరపల్లి కోర్టును కోరగా.. రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది.


దీంతో ఆమెను రెండు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు న్యాయస్థానం అనుమతితో విచారిస్తున్నారు. ఆమె ఎవరెవరి వద్ద నుంచి ఎంత సొమ్ము తీసుకుందనే వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే, ఆ డబ్బును ఎక్కడికి మళ్లించారు? బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లావాదేవీలపైనా లోతుగా ఆరా తీయనున్నారు.


Also Read: Pushpa Trailer: సోషల్ మీడియాలో ‘పుష్ప’రాజ్ ట్రెండింగ్.. ఆకట్టుకుంటున్న ట్రైలర్ కట్ పిక్స్


Also Read: Bigg Boss 5: అదిరిపోయే ట్విస్ట్.. హౌస్‌లోకి స్టార్ యాంకర్‌ రీఎంట్రీ! అసలు కారణం అదేనా?  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook