Bigg Boss 5: అదిరిపోయే ట్విస్ట్.. హౌస్‌లోకి స్టార్ యాంకర్‌ రీఎంట్రీ! అసలు కారణం అదేనా?

బిగ్ బాస్-5కు సంబందించిన ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హౌస్‌లోకి స్టార్ యాంకర్‌ రవి రీఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. రవి హౌస్ నుంచి బయటకు రావడం చాలా నాటకీయంగా జరిగిన విషయం తెలిసిందే. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 3, 2021, 03:11 PM IST
  • బిగ్ బాస్-5లో అదిరిపోయే ట్విస్ట్
  • హౌస్‌లోకి స్టార్ యాంకర్‌ రీఎంట్రీ
  • రీఎంట్రీ ఇవ్వనున్న యాంకర్‌ రవి
Bigg Boss 5: అదిరిపోయే ట్విస్ట్.. హౌస్‌లోకి స్టార్ యాంకర్‌ రీఎంట్రీ! అసలు కారణం అదేనా?

Anchor Ravi will be re-entering the Bigg Boss Telugu House: బిగ్ బాస్ తెలుగు ఐదవ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. టైటిల్ విన్నర్ అయ్యేందుకు హౌస్‌లో ప్రస్తుతం ఉన్నవారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎత్తులుపైఎత్తుల మధ్య సాగుతున్న బిగ్ బాస్ 5 విన్నర్ ఎవరు అవుతారనేది ఊహించడం కాస్త కష్టంగానే ఉంది. ఈ సమయంలో ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హౌస్‌లోకి స్టార్ యాంకర్‌ రవి (Anchor Ravi) రీఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. రవి హౌస్ నుంచి బయటకు రావడం చాలా నాటకీయంగా జరిగిన విషయం తెలిసిందే. టాప్‌-5లో కచ్చితంగా ఉంటాడనుకున్న రవి.. 12వ వారం అనూహ్యంగా ఎలిమినేట్‌ కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. 

బిగ్ బాస్ సీజన్ (Bigg Boss) 5లో ఏకంగా 19 మంది హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దాంతో ఈ సీజన్ మొదటి నుంచి ఆసక్తిగా సాగుతూ వస్తోంది. కంటెస్టెంట్లు అందరూ నువ్వానేనా అన్నట్టు పోటీపడుతున్నారు. ప్రతివారం ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి.. ఒకరు తప్పనిసరిగా బయటకి రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలా మంది హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసారు. టాప్‌-5లో కచ్చితంగా ఉంటాడనుకున్న యాంకర్‌ రవి (Anchor Ravi) అనూహ్యంగా 12వ వారంలోనే ఎలిమినేట్‌ అయి బయటకు వచ్చాడు. ఓట్లు తక్కువచ్చాయన్న కారణంగా రవిని ఎలిమినేట్ చేశారు.

Also Read: IPL 2022: ఆ ఇద్దరు స్టార్ టీమిండియా ఆటగాళ్లది స్నేహబంధం.. ఐపీఎల్‌లో ఒకే జట్టుకు ఆడొచ్చు: వెటోరి

బిగ్ బాస్ హౌస్‌ నుంచి రవి (Ravi) బయటకు రావడాన్ని ఆయన ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. బయటికి వచ్చిన తర్వాత రవి కూడా తన ఎలిమినేషన్ షాకింగ్‌గా ఉందని చెప్పడంతో అనుమానాలు రేకెత్తాయి. కావాలనే రవిని ఎలిమినేట్‌ చేశారంటూ రవి ఫాన్స్ (Ravi Fans) ఆగ్రహం వ్యక్తం చేశారు. 12వ వారంకు సంబందించిన ఓట్ల లెక్కలు చూపించాలంటూ 'స్టార్‌ మా' (Star Maa) ఛానల్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఇక బిగ్ బాస్ షో నిర్వహిస్తున్న అన్నపూర్ణ స్టూడియో వద్ద కూడా రవి అభిమానులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. రవిని మళ్లీ హౌస్‌లోకి  పంపాలంటూ డిమాండ్ చేశారు. 

Also Read: Harish Rao: 'ఒమిక్రాన్​ను​ ఎదుర్కొనేందుకు రెడీ- ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి'

ఇక ఇప్పుడు యాంకర్‌ రవి హౌస్‌లోకి రీఎంట్రీ (Anchor Ravi will be re-entry) ఇవ్వనున్నాడనే వార్తలు నెట్టింట జోరుగా వినిపిస్తున్నాయి. దీనిపై 'స్టార్ మా' కూడా ఆలోచనలో పడిపోయిందని ఊహాగానాలు వస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ వీకెండ్‌లో రవి హౌస్‌లోకి తిరిగి వచ్చే అవకాశం ఉందట. బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu) చరిత్రలో ఇలా రీఎంట్రీ ఇవ్వడం కొత్తేమి కాదు. గత సీజన్లలో పలువురు హౌస్ నుంచి బయటకు వెళ్లి తిరిగి వచ్చారు. శ్యామల, నూతనయుడు, అలీ రెజాలు రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు రవి వంతు రానుంది. ఇదే నిజమయితే అతడే విన్నర్ అవుతాడని అభిమానులు అంటున్నారు. ఏదేమైనా ఈ వార్తలో ఎంత నిజముందో ఈ వారం గడిస్తే కానీ తెలియదు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x