Pushpa Movie Record Collections: తెలుగు పాన్ ఇండియా మూవీ పుష్ప బాక్సాఫీసు వద్ద ప్రభంజనం రేపుతోంది. భారీ అంచనాలతో విడుదలైన సినిమా..కొత్త రికార్డులు సృష్టిస్తోంది. కమర్షియల్‌గా భారీ హిట్ కొట్టనుందని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా ప్రముఖ దర్శకుడు, లెక్కల మాస్టారు సుకుమార్(Sukumar) తెరకెక్కించిన పుష్ప అంచనాల్ని అందుకుంటోంది. హిట్ టాక్ మూటగట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం దుమ్ము రేపుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ కధ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇది తొలి భాగం మాత్రమే. పుష్ప(Pushpa Movie)ది రూల్ పేరుతో రెండవ భాగం వచ్చే ఏడాది విడుదల కానుంది. అద్భుతమైన యాక్షన్ సీన్లతో తెరకెక్కిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటోంది.


అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డులు రాస్తోంది. చిత్రం విడుదలైన రోజే భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి. 2021లో విడుదలైన అన్ని చిత్రాల్లో ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా రికార్డు సాధించింది. సినిమా విడుదలైన తొలిరోజే..ప్రపంచవ్యాప్తంగా 71 కోట్లు వసూలు చేసిందని మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2021లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా ఇదే కావడం విశేషం.


Also read: BB Telugu Grand Finale: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ప్రోమో అదుర్స్...స్టేజ్ పై టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు సందడి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook