Tamilnadu: ఓరి దేవుడా దేవుడా పాటతో తెలుగు ప్రేక్షకుల మనస్సు దోచుకున్న నటి ముంతాజ్. పవన్ కళ్యాణ్ హీరోయిన్‌గా ముద్రపడిన ముంతాజ్‌పై ఇప్పుడు గృహహింస కేసు నమోదైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఖుషీ సినిమాతో ఆరంగేట్రం చేసిన హాట్ నటి ముంతాజ్. ఆ తరువాత పలు సినిమాల్లో వలపులు చిందించి..తాజాగా అత్తారింటికి దారేది సినిమాలో ఓరి దేవుడా దేవుడా పాటతో మరోసారి తళుక్కుమంది. పవన్ కళ్యాణ్ హీరోయిన్‌గా ముద్రపడిన ముంతాజ్‌పై ఇప్పుడు గృహ హింస కేసు నమోదైంది. రేపో మాపో అరెస్టు తప్పదనే వార్తలు వస్తున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి..


ముంతాజ్ గత కొద్దికాలంగా కోలీవుడ్ ఆఫర్ల నేపధ్యంలో చెన్నైలో ఉంటోంది. అక్కడామె ఇంట్లో ఉత్తరాదికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు ఇంటి పని చేస్తున్నారు. ముంతాజ్ తమను వేధిస్తోందని..ఇంటికి పంపించడం లేదంటూ చెన్నై అన్నానగర్ పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసింది ఓ బాలిక. ప్రతిరోజూ ముంతాజ్ చిత్రహింసలు పెడుతోందని ఆ బాలిక ఆరోపించింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ముంతాజ్ ఇంటికెళ్లి  ఆ బాలికను బాలల సంరక్షయణ కేంద్రానికి తరలించి ముంతాజ్‌పై కేసు నమోదు చేశారు. మైనర్ బాలిక వ్యవహారం కావడంతో పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ముంతాజ్‌ను అరెస్టు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 


Also read: Sarkaru Vaari Paata Review: మహేష్ బాబు 'సర్కారు వారి పాట' రివ్యూ... సినిమా ఎలా ఉందంటే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook