Producer KP Chowdary Arrest: సినీ డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ప్రముఖ ప్రొడ్యూసర్, డిస్టిబ్యూటర్ కేపీ చౌదరిని ఎస్‌ఓటీ మాదాపూర్ , రాజేంద్రనగర్ పోలీసులు  అరెస్ట్ చేశారు. కేపీని వారం రోజుల కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. నేడు కస్టడీ పిటిషన్‌పై విచారణ జరగనుంది. కేపీ లిస్టులో సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేపీ ఫోన్‌లో వందల కొద్ది కాంటాక్ట్స్ ఉన్నాయని.. సినీ పరిచయాలు కారణంగా కాంటాక్ట్స్‌లో అధికంగా ప్రముఖులు నెంబర్లు ఉన్నట్లు తెలుస్తోంది. కేపీతో డ్రగ్స్ లింక్స్ ఉన్న సినీ తారలను గుర్తిస్తామని పోలీసులు అంటున్నారు. ఆయన ఇచ్చే సమాచారంతో మరికొంత సినీ తారాల జాతకాలు బయపడతాయని చెబుతున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డ్రగ్ కేసులో ఏ1గా ఉన్న  రాకేష్ రోషన్‌కు సైతం స్టార్స్‌తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పలు పార్టీల్లో డ్రగ్స్ సరఫరా రాకేష్, కేపీ డ్రగ్స్ సరఫరా చేసినట్లు తెలుస్తోంది. మరో వైపు నైజీరియన్ గాబ్రియేల్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. నైజీరియన్ గాబ్రియేల్ నుంచే అధిక శాతం హైదరాబాద్‌లోకి డ్రగ్స్ ఎంటర్ అయింది. గాబ్రియేల్‌పై ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి.


కిస్మత్‌పూర్ ఎక్స్ రోడ్స్ సమీపంలో మాదకద్రవ్యాల వ్యాపార కేసులో కేపీ చౌదరిని అదుపులోకి తీసుకున్నట్లు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు. పెటిట్ ఎబుజర్ అనే నైజీరియన్ వ్యక్తి నుంచి 100 గ్రాముల కొకైన్‌ను కొనుగోలు చేసినందుకు.. అదేవిధంగా డ్రగ్స్ వ్యాపారంలో నిమగ్నమైనందుకు అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. కేపీ చౌదరి 2016లో సినిమా రంగంలోకి రాకముందు పూణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఆపరేషన్స్ డైరెక్టర్‌గా పనిచేశాడు. కానీ ఆశించిన స్థాయిలో లాభాలు రాలేదు. 


ఆ తరువాత గోవాకు వెళ్లి క్లబ్‌ తెరిచి హైదరాబాద్‌ నుంచి వచ్చిన ప్రముఖులతో కలిసి డ్రగ్స్‌ దందా చేసేవాడు. అయితే ఇక్కడ నష్టాలను చవిచూడడంతో  తిరిగి హైదరాబాద్‌కు వచ్చి వ్యాపారాన్ని ప్రారంభించాడు. కేపీ చౌదరి డ్రగ్స్ ఎవరెవరికి విక్రయించారనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కొకైన్ 82.75 గ్రాములు, నగదు రూ.2,05,000, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక ఫోర్ వీలర్ వాహనం స్వాధీనం చేసుకున్నారు.


రజనీకాంత్ నటించిన కబాలి తెలుగు వెర్షన్‌ను కేపీ చౌదరి కొనుగోలు చేశాడు. పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్, మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాలకు డిస్టిబ్యూటర్‌గా పనిచేశాడు. 


Also Read: Adipurush Twitter Review: ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ.. ఆడియన్స్ రియాక్షన్ ఇదే..  


Also Read: TS Gurukul Recruitment 2023: అభ్యర్థులకు ముఖ్యగమనిక.. 9,231 ఉద్యోగ ఖాళీలకు పరీక్షలు ఎప్పుడంటే..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి