Burugapally Siva Rama Krishna: టాలీవుడ్ నిర్మాత అరెస్ట్.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు..!
Siva Rama Krishna arrest: తెలుగు సినిమా నిర్మాత శివరామకృష్ణ పై.. కేసు నమోదు కాగా.. ఈరోజు ఆయనను అరెస్ట్ చేశారు. రాయదుర్గంలో ఉన్న ప్రభుత్వ భూమిని కా చేసినందుకుగాను.. అలానే నకిలీ పత్రాలతో వేలకోట్ల రూపాయల విలువగల భూమిని.. కాజేసే ప్రయత్నం చేసినందుకుగాను ఈ కేసు నమోదు అయింది.
Siva Rama Krishna arrested: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ పై కేసు నమోదు అవ్వగా తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గంలో ప్రభుత్వ భూమిని.. కాజేసేందుకు ప్రయత్నించిన శివరామకృష్ణ నకిలీ పత్రాలతో.. వేల కోట్ల రూపాయల విలువైన భూమిని కాజేసే ప్రయత్నం చేశారట.అందులో భాగంగానే 84 ఎకరాల ల్యాండ్ ను స్వాహా చేసేందుకు ప్రయత్నించినట్లు వార్తలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
అసలు విషయంలోకెళితే స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి పత్రాలు తెప్పించుకున్న శివరామకృష్ణ ఆర్కియాలజీ డిపార్ట్మెంటు సీనియర్ అసిస్టెంట్ కొత్తిని చంద్రశేఖర్ సహాయంతో నకిలీ పత్రాలు సృష్టించి, ల్యాండ్ తమదేనని క్లైమ్ చేసి బిల్డర్ మారగోని లింగం గౌడ్ సహాయంతో ల్యాండ్లో పాగా వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇకపోతే 2003లో నకిలీ పత్రాలపై కోర్టులో కేసు వేసిన అప్పటి ప్రభుత్వం.. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రభుత్వం న్యాయ పోరాటం చేసినట్లు సమాచారం. అయితే శివరామకృష్ణ వి నకిలీ పత్రాలను తేల్చిన సుప్రీంకోర్టు అటు శివరామకృష్ణతోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసింది. ముఖ్యంగా శివ కృష్ణతో పాటు ఆయనకు సహకరించిన చంద్రశేఖర్, లింగం గౌడ్ లపై కూడా కేసు నమోదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఏది ఏమైనా తమ భూమి కాదని తెలిసినప్పటికీ 84 ఎకరాలు ఏకంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన బురుగపల్లి శివరామకృష్ణ పై ఇప్పుడు కేసు నమోదు అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీనిపై నిజా నిజాలు తెలియాల్సి ఉంది.
ఇక ఈయన నిర్మించిన సినిమాల విషయానికొస్తే.. తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు దక్కించుకున్న ఈయన శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ బ్యానర్ ను స్థాపించి నిర్మాతగా కెరియర్ మొదలుపెట్టాడు. అలా వెంకటేష్ హీరోగా, శిల్పా శెట్టి హీరోయిన్గా నటించిన సాహస వీరుడు సాగర కన్య సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన ఈయన.. ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఆ తర్వాత ఎన్నో చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన ఈయన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. ఇక ఇప్పుడు ఇలాంటి అక్రమాలకు పాల్పడి అరెస్టు అయినట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter