Producer CN Rao dies of COVID-19 హైదరాబాద్: కరోనావైరస్ సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తోంది. నిత్యం లక్షల మంది కరోనా బారిన పడుతుండగా.. వారిలో వందలు, వేల మంది కరోనాతోనే కన్నుమూస్తున్నారు. తాజాగా సినీ నిర్మాత చిట్టి నాగేశ్వరరావును (CN Rao) కరోనా బలి తీసుకుంది. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలిలో జాయింట్ సెక్రటరీగా, తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సభ్యుడిగా సేవలు అందించిన సి.ఎన్‌.రావు మృతి పట్ల తెలుగు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సీఎన్ రావు గతంలో తెలుగులో మా సిరిమల్లె, అమ్మనాన్నలేకుంటే, బ్రహ్మానందం డ్రామా కంపెనీ వంటి పలు చిత్రాలు నిర్మించారు. అలాగే తమిళంలోనూ ఒకట్రెండు చిత్రాలకు నిర్మాతగా, పంపిణీదారుడిగానూ వ్యవహరించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Oxygen tank leaked: నాసిక్‌లో ఆక్సీజన్ ట్యాంకర్ లీక్.. 22 మంది కరోనా రోగులు మృతి


కరోనాతో (COVID-19) నిర్మాత చిట్టి నాగేశ్వర రావు అకాల మరణం చెందడం పట్ల (CN Rao's death news) దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు.. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపం ప్రకటించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook