Producers Guild Stops the Tollywood Shootings: తెలుగు సినీ నిర్మాణ వ్యయం తగ్గించాలంటూ నిర్మాతలు కొద్ది రోజుల నుంచి షూటింగ్స్ నిలిపివేయడానికి ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. సినీ నిర్మాణం భారీ వ్యయం అయిపోతూ ఉండడం సినిమాకు కలెక్షన్లు వస్తాయో రావో అనే టెన్షన్లో ఉన్న నిర్మాతలు కొందరు ఈ వ్యయం తగ్గించుకునే విషయం మీద ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకు షూటింగ్స్ నిలిపివేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే గత కొద్ది రోజులుగా హైదరాబాదులో అనేకసార్లు సినీ నిర్మాతలు సమావేశం అవుతూ వస్తున్నారు. ఇక తాజాగా హైదరాబాద్ కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉన్న యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమావేశం జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సమావేశానికి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతో పాటు భరత్ చౌదరి,  ఎర్నేని రవిశంకర్ వంటి వారు సుమారు 25 మంది హాజరయ్యారు. ఇక ఈ భేటీకి సంబంధించిన వివరాలు కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆగస్టు ఒకటో తేదీ నుంచి సినిమా షూటింగ్స్ నిలిపివేయాలని నిర్మాతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇంకా ఆగస్టు ఒకటో తారీకుకి మరో నాలుగు రోజులే ఉన్న నేపథ్యంలో ఈ లోపు సినీ పెద్దలు చొరవ తీసుకోకుంటే కనుక సినిమా షూటింగ్స్ నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమాలను పది వారాల తర్వాత పరిమిత బడ్జెట్‌లో తెరకెక్కిన చిత్రాలు 4 వారాల తర్వాత ఓటీటీకి ఇవ్వవచ్చని నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.


అలాగే 6 కోట్లలోపు బడ్జెట్‌ చిత్రాలపై ఫెడరేషన్‌తో చర్చించాక తుది నిర్ణయం తీసుకోబోతుననట్టు చెబుతున్నారు. ఇక సినిమా ప్రదర్శన కోసం చెల్లించే విపిఎఫ్ చార్జీలను ఇకమీదట ఎగ్జిబిటర్లే చెల్లించాలని  ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయించింది. అంతేగాక సామాన్యులకు టికెట్ ధరలు అందుబాటులో ఉండాల్సిందేనని కూడా వారు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. సాధారణ థియేటర్లలో సి క్లాస్ సెంటర్లలో టికెట్ ధరలు 100 రూపాయలు నుంచి 70 రూపాయలు వరకు ఉండేలాగా ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. అలాగే మల్టీప్లెక్స్ లో అయితే జిఎస్టితో కలిపి 150 రూపాయల నుంచి 120 రూపాయలు ఉండేలాగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఫిలిం ఛాంబర్,  నిర్మాతల మండలితో చర్చించాక సినిమా నిర్మాణ వ్యవయాలు పెంచుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఫిలిం ఛాంబర్ నిర్ణయించిన రేట్ కార్డు ప్రకారమే షూటింగ్ ప్రదేశాలలో నిర్మాతలు పే చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. నిర్మాతలను తప్పుదోవ పట్టిస్తున్న మేనేజర్లు కోఆర్డినేటర్లు వ్యవస్థను పూర్తిగా తొలగించే విధంగా కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


అంతేకాక నిర్ణీత సమయానికి నటీనటులు షూటింగ్ స్పాట్ కి అటెండ్ అయ్యే విధంగా నిబంధనలు కఠినం చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒకవేళ నటీనటులు సహాయకులకు వసతులు కావాలి ఇతర సౌకర్యాలు కావాలి అంటే వారి పారితోషకం నుంచే కోత విధించాల్సి ఉంటుందంటూ కూడా నిర్ణయాలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి హీరో హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులకు పేమెంట్స్ తో పాటు సినీ టెక్నీషియన్స్ పేమెంట్లు కూడా నిర్మాతలకు భారంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఇదే విషయం మీద కొంతమంది తీవ్ర ఆరోపణలు కూడా చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. పూజా హెగ్డే వస్తే ఆమె వెంట 12 మంది సహాయకులు వస్తున్నారని వారందరికీ బేటాలు నిర్మాతలు చెల్లించాల్సి వస్తోందని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇక ఈ నిర్ణయాల మీద అధికారిక ప్రకటన వస్తే మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. 


Also Read: Allu Arjun: పుష్ప 2 కంటే ముందే సెట్స్ కు బన్నీ.. త్రివిక్రమ్ డైరెక్షన్లో ప్రాజెక్ట్!


Also Read:Ram Charan: రామ్ చరణ్-శంకర్ మూవీకి చిక్కులు.. నిలిపివేయాలంటూ బీజేపీ ధర్నా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook